Friday, November 15, 2024

మైక్రోఫైనాన్స్ సంస్థ సొనాటా ఫైనాన్స్‌ ను కొననున్న కోటక్ మహీంద్రా బ్యాంక్..

- Advertisement -
- Advertisement -

ముంబై: సొనాటా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (“SFPL”) 100% ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయడానికి బైండింగ్ షేర్ కొనుగోలు ఒప్పందం(లు) అమలు చేసినట్లు కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ రోజు ప్రకటించింది. సొనాటా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ. ఇప్పటికే ఉన్న వాటాదారుల నుండి NBFC-MFIగా వర్గీకరించబడింది. ఈ ఒప్పందం అమలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా నియంత్రణ సంస్థలు, ఇతర ఆమోదాలకు లోబడి ఉంటుంది.

లావాదేవీ నిర్మాణం, మూల్యాంకనం

దాదాపు రూ. 537 కోట్ల మొత్తం నగదు పరిగణనతో ఈ కొనుగోలు జరిగింది. ఈ కొనుగోలుతో, నియంత్రణ సంస్థలు, ఇతర అనుమతులు పొందిన తర్వాత SFPL పూర్తిగా బ్యాంక్‌కు అనుబంధంగా ఉంటుంది.

వ్యూహాత్మక హేతుబద్ధత

1. ఆర్థిక చేకూర్పు: SFPL ఆర్థికంగా బలహీనమైన, వెనుకబడిన కుటుంబాలకు వాణిజ్యపరంగా లాభదాయక మైన రీతిలో సేవలందిస్తూ, ఆర్థిక చేకూర్పు విభాగంలో బ్యాంక్‌ను ఒక ముఖ్యమైన సంస్థగా మార్చడానికి ఒక బలమైన వేదికను అందిస్తుంది.

2. కాంప్లిమెంటరీ బ్రాంచ్ నెట్‌వర్క్: డిసెంబరు 31, 2022 నాటికి, SFPL రూ.1,903 కోట్ల అసెట్ అండర్ మేనేజ్‌ మెంట్ (AUM)ని కలిగి ఉంది, 10 రాష్ట్రాల్లోని 502 బ్రాంచ్‌ల బ్రాంచ్ నెట్‌వర్క్ ద్వారా 9.0 లక్షల కస్టమర్ బేస్‌కు సేవలు అందిస్తోంది, ఇది బ్యాంక్ మైక్రోఫైనాన్స్‌ వర్క్‌ ను పూర్తి చేస్తుంది. .

3. ఎదుగుదలకు సంభావ్యత: భారతదేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లోని గ్రామీణ & సెమీ-అర్బన్ మార్కెట్‌లలో తన కార్యకలాపాలను పెంచుకోవడానికి ఈ లావాదేవీ బ్యాంక్‌కు అవకాశాన్ని అందిస్తుంది. SFPL దాదాపు రెండు దశాబ్దాల అనుభవం కలిగిన, ఈ మార్కెట్‌లలోని కస్టమర్‌లపై లోతైన అవగాహన కలిగిన మైక్రోఫైనాన్స్ సంస్థ.

4. విలువ పెంపు: బ్యాంక్ యొక్క స్వంత పంపిణీ ఉనికి, సాంకేతికతతో పాటు ఎదుగుదల, సామర్థ్యాల వెలికి తీతల కారణంగా కొనుగోలు ప్రారంభం నుండి సంస్థ విలువను పెంచుతుందని భావిస్తున్నారు. అభివృద్ధి చెం దుతున్న బ్యాంకింగ్ అవసరాలకు సరిపోయేలా SFPL కస్టమర్ బేస్‌కు విస్తృతమైన బ్యాంకింగ్ ఉత్పత్తులను అందించడానికి SFPL నెట్‌వర్క్‌ ను కూడా బ్యాంక్ ప్రభావితం చేస్తుంది.

కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రెసిడెంట్ (కమర్షియల్ బ్యాంకింగ్) మనీష్ కొఠారి మాట్లాడుతూ.. “సోనాటా ఒక ప్రము ఖ మైక్రో ఫైనాన్స్ సంస్థ, గత రెండు దశాబ్దాలుగా బలమైన సంస్థను నిర్మించింది. ఈ కొనుగోలు మా విస్తృత దృ ష్టి, వ్యూహానికి అనుగుణంగా ఉంది. మేం 2017లో BSS మైక్రోఫైనాన్స్‌ ని విజయవంతంగా కొనుగోలు చేశాం. అప్పటి నుండి 1.3 మిలియన్ల రుణగ్రహీతలకు రూ.5,300 కోట్లకు పైగా అడ్వాన్స్‌ లతో ఆర్థిక చేరిక విభాగంలో మా ఉనికిని ఏకీకృతం చేయగలిగాం & స్థిరంగా పెంచుకోగలిగాం. ఈ సముపార్జన ఫలితంగా గణనీయ సంభావ్య సమన్వయాలు ఉన్నాయి. కస్టమర్‌ లకు సజావుగా, సుస్థిరమైన పద్ధతిలో సేవలను అందించాలని, వారి అవ సరాలు తీర్చేలా ముందుకు సాగాలని మేం ఎదురు చూస్తున్నాం” అని అన్నారు.

SFPL సీఈఓ, ఎండీ, అనూప్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. “కోటక్ మహీంద్రా గ్రూప్ విశ్వసనీయ, అనుభవ జ్ఞుల చేతుల్లో సొనాటా ఉండటం నాకు చాలా సంతోషంగా కలిగిస్తోంది. అంతగా బ్యాంకింగ్ సేవలు పొందలేకపో తున్న కస్టమర్ విభాగానికి ఫైనాన్సింగ్ అందించే లక్ష్యంతో సొనాటా ప్రారంభించబడింది. ఈ కార్యాచరణ పెద్ద బ్యాంక్ వేదికపై మరింతగా, స్థిరమైన పద్ధతిలో ఉత్తమంగా అందించబడుతుందని నేను నమ్ముతున్నాను. ఈ లావాదేవీ సొనాటా కస్టమర్‌లు, ఉద్యోగులు, ఇతర వాటాదారులకు అపారమైన ప్రయోజనాలను అంది స్తుంది. సొనాటా ప్రస్తుత కస్టమర్ కుటుంబాలు కోటక్ బ్యాంక్ పూర్తి స్థాయి ఉత్పత్తులు, ఉత్తమమైన డిజిటల్ సేవల నుండి ప్రయోజనం పొందగలుగుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను’’ అని అన్నారు.

“ఈ దశకు కంపెనీని నిర్మించడంలో సహకరించిన పెట్టుబడిదారులు, కస్టమర్లు, ఉద్యోగులు, ఇతర వాటాదారు లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News