Saturday, January 18, 2025

కోటక్ రిజర్వ్‌ ను ప్రారంభించిన కోటక్ ప్రైవేట్ బ్యాంకింగ్

- Advertisement -
- Advertisement -

కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ (“KMBL”/ “కోటక్”) విభాగమైన కోటక్ ప్రైవేట్ బ్యాంకింగ్ అల్ట్రా హైనెట్ వర్త్ ఇండివిడ్యువల్స్, హైనెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ కోసం క్యూరేటెడ్ కోటక్ రిజర్వ్ – సేవింగ్స్ ప్రోగ్రామ్*ని ప్రారంభించినట్లు నేడిక్కడ ప్రకటించింది. బ్యాంకింగ్‌కు మించి సేవలను విస్తరించ డంలో భాగంగా, బై ఇన్వైట్ కార్యక్రమంగా ఇది ఖాతాదారులకు మునుపెన్నడూ లేని విధంగా విలాసవం తమైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడానికి రూపొందించబడిన ప్రత్యేకమైన సేవలను అందిస్తుంది.

ఈ సేవింగ్స్ ప్రోగ్రాం ద్వారా, కోటక్ ప్రైవేట్ బ్యాంకింగ్ ప్రయాణం, ఆరోగ్యం & వెల్నెస్, వినోదం వంటి అనేక ప్రత్యేకమైన జీవనశైలి ఆఫర్‌ల ద్వారా అసమానమైన ప్రీమియం బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఉన్న ఆఫర్‌లకు ఈ జోడింపు అనేది కోటక్ ప్రైవేట్ బ్యాంకింగ్‌ ఖాతాదారుల కు ఇప్పటికే అందిస్తున్న సేవలకు సంబంధించి మరింత ఉన్నతశ్రేణిని జోడిస్తుంది.

ముఖ్యమైణ ఆఫర్లు:

· బస, భోజనం, స్పా వంటి అనేక రకాల సేవలలో ప్రత్యేకమైన ఎపిక్యూర్ ప్రివిలేజ్డ్ మెంబర్‌షిప్ బై తాజ్

లగ్జరీ వెకేషన్ ప్లాన్ చేయడం నుండి ప్రైవేట్ సాంస్కృతిక విహారం వరకు లేదా ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన మిషెలిన్ స్టార్డ్ రెస్టారెంట్లలో రిజర్వేషన్లు పొందడం వరకు ప్రత్యేకమైన లైఫ్ స్టైల్ పరిష్కారా లను అందించే లఫాయెట్ లగ్జరీ కన్సియెర్జ్*

కళ, సంస్కృతి, సినిమా, వినోద అద్భుతాలను ఆస్వాదించడానికి BookMyShow* వోచర్‌లు

లాకర్లు, లోన్‌లు, అపరిమిత హోమ్ బ్యాంకింగ్ సేవలు, తన ఖాతాదారుల కోసం ప్రత్యేక కాల్ బ్యాక్ సేవ వంటి సేవలపై ప్రిఫరెన్షియల్ ప్రైసింగ్*

కోటక్ వైట్ రిజర్వ్ క్రెడిట్ కార్డ్^ ఇది ప్రత్యేకమైన క్లబ్ మారియట్ మెంబర్‌షిప్. భారతదేశంలోని అత్యు త్తమ గోల్ఫ్ కోర్సులలో టీ-ఆఫ్‌లు మరియు ప్రపంచవ్యాప్తంగా, అపరిమిత కాంప్లిమెంటరీ ఇంటర్నేషనల్ మరియు డొమెస్టిక్ లాంజ్ సందర్శనలను అందిస్తుంది.

ఈ సందర్భంగా కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్, ప్రైవేట్ బ్యాంకింగ్ సీఈఓ ఒయిషార్య దాస్ మాట్లాడుతూ, ‘‘మేం ప్రత్యేకమైన సేవింగ్స్ ప్రోగ్రామ్-రిజర్వ్‌ ను నిర్వహిస్తున్నాం. ఇది మా అల్ట్రా హైనెట్ వర్త్ ఇండివిడ్యు వల్స్, హైనెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ ఖాతాదారులకు చక్కటి అనుభవాలను అందిస్తుంది. బై ఇన్వైట్ ద్వా రా, బ్యాంకింగ్‌కు మించిన ఉన్నతమైన అనుభవం కోసం రిజర్వ్ అనేక ప్రత్యేక సదుపాయాలను అందిస్తుంది. దీని కోసం మేం ప్రముఖ లగ్జరీ బ్రాండ్‌లతో కలసి ప్రయాణిస్తున్నాం. ఇది మా ఆఫర్‌ల సూట్‌కు అమూల్యమైన అదనపు జోడింపుగా ఉంటుందని మరియు ప్రీమియం బ్యాంకింగ్ ప్రపంచంలో గేమ్-ఛేంజర్ అని మేము విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News