- Advertisement -
అమరావతి: ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొత్త ఒరవడిని సృష్టించారని మంత్రి నారా లోకేష్ తెలిపారు. కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎక్స్ వేదికగా కోటం రెడ్డిని అభినందించారు. ఒకేరోజు 105 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. 105 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి రికార్డు సృష్టించారని కోటంరెడ్డిని ప్రసంసించారు. దేశ, రాష్ట్ర చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టమని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుందనడానికి ఇదొక ఉదాహరణ అని నారా లోకేష్ స్పష్టం చేశారు.
- Advertisement -