Monday, January 20, 2025

నా ఆస్తులను ఆధారాలతో చూపిస్తా: కొత్త ప్రభాకర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

 

సిద్దిపేట: 1986 నుంచి వ్యాపారం చేస్తున్నానని, అప్పటి నుంచి నాది వైట్ పేపర్ మీదనే ఉంటదని మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఐటి దాడుల నేపథ్యంలో కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాకలో మీడియాతో మాట్లాడారు. ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి అంటేనే వైట్ షీట్ అని, తన ఇంటిపై ఐటి దాడులు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉంటుందని ఎద్దేవా చేశారు. ఇవన్నీ ఎన్నికల ముందు బదనాం చేయడానికి తప్ప మరేమి కాదన్నారు. వారు చేసే ఐటి సోదాలో ఎలాంటి ఆధారాలు ఉండవన్నారు. తనకు ఎవరితో పొత్తులుండవని, వేరే దందాలుండవన్నారు. ఇంతకు ముందు ఎప్పుడు లేని దాడులు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారో ప్రజలు గమనించాలన్నారు. ఇది కేవలం బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, తన దగ్గర ఎన్ని ఆస్తులున్న ఆధారాలతో సహా చూపిస్తానని సవాలు విసిరారు.

Also Read: తెలంగాణ వచ్చాక ఆరోగ్య శాఖ అతికీలకమైందిగా భావించాం: సిఎం కెసిఆర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News