Saturday, December 28, 2024

అంబులెన్స్ లో వచ్చి నామినేషన్ వేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి..

- Advertisement -
- Advertisement -

ఇటీవల కత్తిపోటుకు గురైన దుబ్బాక బిఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేశారు. నామినేషన్లకు చివరి తేదీ రేపే(నవంబర్ 10, శుక్రవారం) కావడంతో.. గురువారం కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఆర్డిఓ కార్యాలయానికి అంబులెన్స్ లో వచ్చారు. అంబులెన్స్ నుంచి వీల్ చైర్ లో కార్యాలయంలోకి వెళ్లి తన నామినేషన్ పత్రాలను ఆర్డిఓ అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు తోపాటు పలువురు స్థానిక బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News