Monday, December 23, 2024

‘కొత్తగా లేదేంటీ’ అంటున్న వైష్ణవ్ తేజ్.. (ప్రోమో)

- Advertisement -
- Advertisement -

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న మూడో చిత్రం ‘రంగరంగా వైభవంగా’. ఈ మూవీని గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో వైష్ణవ్ సరసన కేతిక శర్మ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసి తొలి సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీలోని ‘కొత్తగా లేదేంటీ..’ అంటూ సాగే రెండో పాట ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. శ్రీమణి లిరిక్స్ అందించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో సింగర్స్ అర్మన్ మాలిక్, హరిప్రియ ఆలపించిన ఈ మెలోడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పూర్తి సాంగ్ మే 6న విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.

Kothaga Ledhenti lyrical song promo out

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News