Monday, December 23, 2024

కుమారుడి గొంతుకోసి చంపిన తల్లిదండ్రులు

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: మద్యానికి బానిసగా మారి తల్లిదండ్రులను వేధించడంతో వారు తన కుమారుడిని సుపారీ ఇచ్చి గొంతు కోసి చంపించిన సంఘటన తెలంగాణలోని కొత్తగూడెం భద్రాద్రిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తెలంగాణలోని భద్రాచలంలో మెడికల్ కాలనీలో రాము(57)-సావత్రి(55) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు దుర్గా ప్రసాద్ (35) అనే కుమారుడు ఉన్నాడు. దుర్గా ప్రసాద్ మద్యానికి బానిసగా మారి డబ్బుల కోసం కుటుంబ సభ్యులను వేధించడంతో భార్య అతడిని వదిలి తన పుట్టింటికి వెళ్లిపోయింది. డబ్బుల కోసం ఉన్న ఇంటిని అమ్ముతానని తల్లిదండ్రులను బెదిరించడంతో వారు అతడిని చంపాలని నిర్ణయం తీసుకున్నారు. గుమ్మడి రాజు(33), షేక్ ఆలీ పాషా(32) మూడు లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి తన కుమారుడిని చంపాలని వారు నిర్ణయం  తీసుకున్నారు.

సెప్టెంబర్ 9న దుర్గా ప్రసాదన్‌ను రాజు, అలీ, అతడు తల్లిదండ్రులు గొంతు కోసి హత్య చేశారు. అనంతరం ఆటోలో మృతదేహాన్ని ఎపి రాష్ట్రం అల్లూరీ సీతారామ రాజు జిల్లాలోని తుమ్మలనగర్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి తగలబెట్టారు. వెంటనే నలుగురు ఊరు వదిలిపారిపోయారు. అడవిలో పుల్లల కోసం వెళ్లిన వ్యక్తులకు మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తెలంగాణ, ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో ఫొటోతో కర పత్రాలు వేశారు. అతడి భార్య కర పత్రాలలో తన భర్తను గుర్తించి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి తల్లిదండ్రులతో పాటు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News