Monday, December 23, 2024

కొత్తగూడెం నియోజకవర్గాన్ని బిసిలకు కేటాయించాలి

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల్లో ఏడు రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి కేటాయించగా మిగిలిన మూడు జనరల్ స్థానాల్లో ఒకటి మినహా రెండింటిలో అగ్రవర్ణాలు పాగా వేస్తున్నాయని కొత్తగూడెం స్థానాన్ని బిసిలకు కేటాయించాలని మున్నూరుకాపు సంక్షేమ సంఘం కొత్తగూడెం నాయకులు విజ్ఞప్తి చేశారు. సోమవారం భజనమందిరంలో ఉన్న ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనాభాలో 60 శాతం ఉన్న బిసి కులస్థులు అభ్యర్ధుల గెలుపు ఓటముల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారని అయితే రాజ్యాధికారం మాత్రం అందని ద్రాక్షగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యధికంగా వెనుకబడిన తరగతుల వారు ఉన్న కొత్తగూడెం లాంటి ప్రాంతంలో బిసిలకు రిజర్వేషన్ కల్పిస్తే న్యాయం జరుగుతుందని వివరించారు. పార్టీలకు అతీతంగా తమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరారు. లేదంటే ఐక్య వేదిక ద్వారా పోరాటాలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అధ్యక్షులు కాసా హన్మంతరావు, సెక్రటరీ లింగాల గోపాల కృష్ణయ్య, కోశాధికారి మహాలక్ష్మీ సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వల్లాల ప్రసాద్‌రావు, కొత్తగూడెం నియోజకవర్గ ఇంఛార్జ్ బాలిశెట్టి సుందర్‌రాజ్ బండారి రుక్మంగధర్‌రావు, కార్యవర్గ సభ్యులు మాదాసు కృష్ణయ్య, మత్తి నాగేశ్వరరావు బండ్ల నకుల్, కోళ్ల నరసయ్య, కందుకూరి గణేష్, సైండ్ల రాజు, గాజుల శ్రీనివాస్, సుంకు సత్యనారాయణ,కుంట రవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News