కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షుడు కోనేరు రాజీనామా
త్వరలో బిఆర్‌ఎస్‌లో చేరిక
సిఎం కెసిఆర్‌ను కలిసిన నేత
మనతెలంగాణ/ హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని)ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు బిజెపి కార్యాలయం కార్యదర్శి డాక్టర్ బి. ఉమాశంకర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు భారతీయ జనతా పార్టీ నుండి ’సస్పెండ్’ చేశాం. ఈ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన వెల్లడించారు.
ముఖ్యమంత్రిని కలిసిన చిన్ని
ఈ నెల 27న ఖమ్మంలో జరిగే అమిత్ షా సభకు ముందు బిజెపికి షాక్ తగిలింది… ఆ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష పదవికి, బిజెపి ప్రాథమిక సభ్యత్వానికి కోనేరు సత్యనారాయణ అలియాస్ చిన్ని రాజీనామా చేశారు.. మంగళారం సిఎం కెసిఆర్‌ను, ఎమ్మెల్సీ కవితలను ఆయన కలిశారు.. ఈయన తండ్రి దివంగత కోనేరు నాగేశ్వరరావు సుధీర్ఘ కాలం శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ తరవున సేవలు అందించారు.. నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు గెలుపు కోసం కృషి చేయాలని కోనేరు సత్యనారాయణ అలియాస్ చిన్నికు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.