Monday, December 23, 2024

నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే వనమా

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెంలో మెగా జాబ్ మేళాలను ప్రారంభించిన : ఎమ్మెల్యే వనమా

కొత్తగూడెం: నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కృషి చేస్తున్నారని, విద్యార్థులు కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని ఎంఎల్ఎ వనమా తెలిపారు. ఈ రోజు కొత్తగూడెం క్లబ్ లో తెలంగాణ ప్రభుత్వము ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను జ్యోతి ప్రజ్వలన చేసి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో వనమా రాఘవేందర్, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి విజేత, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, చుంచుపల్లి ఎంపిపి బాదవత్ శాంతి, మార్కెట్ కమిటీ చైర్మన్ బుక్య రాంబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, కౌన్సిలర్లు కోలాపురి ధర్మరాజు, రుకుమెందర్ బండారి, పల్లపు లక్ష్మణ్, టిఆర్ఎస్ నాయకులు ఎంఎ రజాక్, రావి రాంబాబు, కె కె శ్రీను, ఉప సర్పంచ్ లగడపాటి రమేష్, పిల్లి కుమార్, ఫోటోగ్రాఫర్ రాజేష్, అజయ్, మెరుగు అనుసూర్య, కర్రీ అపర్ణ మరియు స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఉపాధి కల్పన శాఖ అధికారులు, వివిధ కంపెనీల హెచ్ఆర్ లు, నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News