Sunday, February 2, 2025

టిడిపి మాజీ ఎంఎల్ఎ దయాకర్ రెడ్డి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: టిడిపి మాజీ ఎంఎల్‌ఎ కొత్తకోట దయాకర్ రెడ్డి మంగళవారం ఉదయం కన్నుమూశారు. గత నెల రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో ఎఐజి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. టిడిపి నుంచి దయాకర్ రెడ్డి మూడు సార్లు ఎంఎల్‌ఎగా గెలిచి ప్రజా సేవ చేశారు. 2009లో మక్తల్ నుంచి ఒకసారి, 1994, 1999లో అమరచింత నుంచి రెండు సార్లు గెలుపొందారు. దయాకర్ రెడ్డి మృతి పట్ల సిఎం కెసిఆర్, టిడిపి అధినేత, ఎపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, టిడిపి నేతలు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం పర్కపురం గ్రామంలో జన్మించారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా పని చేశారు.

Also Read: రెరా చైర్మన్‌గా సత్యనారాయణ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News