- Advertisement -
హైదరాబాద్: జ్యోతిష్య, వాస్తు పండితుడు, సినిమాల ముహూర్త సిద్ధాంతి కొఠారు సత్యనారాయణ చౌదరి(75) కన్నుమూశారు. శ్వాస సంబంధమైన సమస్యలతో జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సత్యనారాయణ బుధవారం తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం సింగరాజుపాలెంలో గురువారం అంత్యక్రియలు జరుగుతాయని బంధువులు పేర్కొన్నారు. ఆయనకు భార్య అనసూయ, కుమారుడు శ్రీనివాసరావు, కూతురు నాగమణి ఉన్నారు. రాజకీయ, ఆర్థిక, పారిశ్రామిక, సినీ, క్రీడాంశాలపై జ్యోతిష్యాన్ని చెప్పేవారు.
- Advertisement -