Monday, January 20, 2025

కోతి దేవుడి జాతరకు వేళాయే …!

- Advertisement -
- Advertisement -

నేటి నుండి రెండు రోజుల పాటు సాగనున్న జాతర
నేడు రథోత్సవం , రేపు జాతర , అన్నదాన కార్యక్రమం

మన తెలంగాణ/ లక్ష్మణచాంద: ఎంతో ప్రసిద్దిగాంచిన , పురాతన చరిత్ర కలిగిన కోతి దేవుడి జాతరకు సర్వం సిద్దం అయింది. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని ధర్మారం గ్రామంలో వెలసిన కోతిదేవుడి జాతర నేటి నుండి రెండు రోజుల పాటు జరుగనుంది. నేడు సోమవారం స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు రాత్రి స్వామి వారి రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అలాగే మంగళవారం స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు భారీ ఎత్తున జాతర సాగనుంది. అలాగే మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కోతిదేవుడిని దర్శించుకునేందుకు నిర్మల్ , ఆదిలాబాద్ జిల్లాల నుండే కాకుండా నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్ నుండి సైతం భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు. పవిత్ర కోనేటిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామికి వారికి మొక్కులు తీర్చుకుంటారు.

కోతి దేవుడి ఆలయ చరిత్ర: ఈ ఆలయానికి దాదాపు నాలుగు దళాబ్దాల చరిత్ర ఉందని. కోరిన కోరికలు తీర్చే కోతి దేవుడిగా ప్రసిద్ది చెందాడు. ప్రతీ ఏటా డిసెంబర్ 19, 20 తేదీలల్లో కోతి దేవుడి జాతర జరుగుతుంది. 1976వ సంవత్సరంలో ధర్మారం గ్రామం చుట్టు దట్టమైన అడవి ఉండేంది. అప్పట్లో ఈ గ్రామంలో బుర్ర కథలు, వీధి నాటకాలు వేసేశారు. అటవీ నుండి వచ్చిన కోతి నిత్యం వీటిని వింటూ ఉండేందని, ఇలా గ్రామంలోకి రావడం మొదలు పెట్టిన కోతి మితిమీరిన ఆగడాలతో ఊరి జనానికి విసుకు తెప్పించిందని, దీంతో అందరికి కలిసి ఆ కోతిని చంపి ఊరి పొలిమెరలో పాతిపెట్టారు. దీంతో ఆ కోతి లేని లోటు గ్రామస్తుల్లో స్పష్టంగా కనిపించిందని, మూడు రోజుల తరువాత కోతి శవాన్ని బయటకు తీసి, ఊరి చివరిన శాస్త్రోక్తంగా సమాధీ కట్టినట్లు గామస్తులు తెలిపారు. అప్పటి నుండి కోరిన కోరికలు తీర్చే కోతి దేవుడిగా ప్రసిద్ది చెందిందని, వేల సంఖ్యలో భక్తులు హాజరై స్వామి వారిని దర్శించుకుంటారని తెలిపారు.

భక్తులకు ఇబ్బందులు ఏర్పాట్లు: కోతి దేవుడి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. తాగునీరు, అన్నదాన కార్యక్రమం, స్వామి వారి దర్శనం కోసం సకల సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News