Saturday, January 18, 2025

ఐలమ్మకు గౌరవం.. కోఠి మహిళా యూనివర్సిటీకి పోరాటియోధురాలి పేరు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: కోఠిలోని మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని నిర్ణయించామని, చాకలి ఐలమ్మ మనుమరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జరిగిన చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఐలమ్మ కుటుంబ సభ్యులను ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండాలని తమ ప్రభుత్వం భావిస్తోందన్నారు. తెలంగాణలో ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగిస్తామన్నారు.

దొరల చేతుల్లో ఉన్న వేలాది ఎకరాలను పేదలకు చేరాలని ఐలమ్మ పోరాటం చేశారన్నారు. చాకలి ఐలమ్మ స్పూర్తితోనే ఇందిరా గాంధీ భూ సంస్కరణలు తెచ్చారన్నారు. భూమి పేదవాడి ఆత్మగౌరవమని, అందుకే ఇందిరమ్మ పేదలకు లక్షల ఎకరాలను పంచిపెట్టారన్నారు. ధరణి ముసుగులో కొందరు పేదల భూములను గుంజుకునే కుట్ర చేశారన్నారు. పేదల భూములను కాపాడుకునేందుకే ఐలమ్మ స్పూర్తితో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News