Friday, January 10, 2025

బిఎస్పీలో చేరిన కొత్త మనోహర్‌ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో సొంత పార్టీలో టికెట్లు లభించని నాయకులు ఇతర పార్టీలో చేరి బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు వేగం చేస్తున్నారు. మొన్నటి వరకు బిఆర్‌ఎస్,బిజెపి, కాంగ్రెస్ పార్టీల్లో చేరికలు పెద్ద సంఖ్యలో జరిగాయి. శుక్రవారం మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు నాయకుడు కొత్త మనోహర్‌రెడ్డి బిఎస్పీ తీర్ధం పుచ్చుకున్నారు.

ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కోఆర్డినేటర్ ఎంపీ రాంజీ గౌతమ్, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో బహుజన్ సమాజ్ పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం కొత్త మనోహర్ రెడ్డికి పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఎస్పీతో సామాజిక న్యాయం జరుగుతుందని, ఇప్పటివరకు ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్ధుల జాబితాలో బిసి,ఎస్సీ,ఎస్టీలకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News