Friday, December 20, 2024

వనపర్తిలో చెట్టును ఢీకొట్టిన కారు: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

వనపర్తి: కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన సంఘటన వనపర్తి జిల్లాలోని కొత్తకోట పరిధిలోని జాతీయ రహదారిపై జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మృతులలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. కర్నాటకలోని బళ్లారి నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు అబ్దుల్ రహమాన్(62), సలీమా జీ(85), చిన్నారులు వాసీర్ రవుత్(7), బుస్రా(2), మరియా(5)గా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News