Monday, December 23, 2024

చంద్రబాబు రూ. లక్ష కోట్లు సింగపూర్‌కు తరలించారు: కొట్టు

- Advertisement -
- Advertisement -

నంద్యాల: జన సేన పార్టీకి స్టాండ్‌లేదని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు అద్దెకు ఇచ్చే పార్టీకి స్టాండ్ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. గురువారం కొట్టు మీడియాతో మాట్లాడారు. సిఎం జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక దొంగ ఓట్ల గురించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ. లక్ష కోట్లు సింగపూర్‌కు తరలించారని ఆరోపణలు చేశారు. చంద్రబాబు దగ్గర జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీసుకొని మాట్లాడుతున్నాడని కొట్టు దుయ్యబట్టారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు తక్కువ కురవడంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండలేదని, వర్షాల కోసం ఏడు రోజుల పాటు యాగాలు, జపాలు నిర్వహిస్తున్నామని కొట్టు వెల్లడించారు. శ్రీశైల దేవాలయానికి ఏడు ఐఎస్ఒ సర్టిఫికెట్లు రావడంతో సంతోషంగా ఉందన్నారు. శ్రీశైలంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు సిఎం జగన్ చేపడుతారని ధ్వజమెత్తారు.

Also Read: పంచాంగాన్ని నమ్ముకోండి: పోలీసులకు యుపి డిజిపి క్లాసు !(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News