- Advertisement -
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్ అని మరోసారి రుజువైందని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. టిడిపితో జనసేన పొత్తు ఉంటుందని పవన్ కల్యాణ్ చెప్పిన సందర్భంగా కొట్టు మీడియాతో మాట్లాడారు. కాపులకు ద్రోహం చేసిన వ్యక్తితో పవన్ కలవడమేంటని ప్రశ్నించారు. పవన్ నిర్ణయం కాపులను తలదించుకునేలా చేస్తుందని దుయ్యబట్టారు. పవన్ ఉంటే షూటింగ్లో లేదంటే బాబు కాళ్ల వద్ద ఉంటున్నాడని మంత్రి కొట్టు మండిపడ్డారు. టిడిపి-జనసేన అపవిత్ర పొత్తును ప్రజలు ఉపేక్షించరని ఎద్దేవా చేశారు.
Also Read: బిజెపితో పవన్ పెళ్లి… టిడిపితో కాపురం: వెల్లంపల్లి
- Advertisement -