Wednesday, January 22, 2025

బ్లాక్ బుక్ లో మొదటి పేరు పొన్నం ప్రభాకర్ దే: కౌశిక్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మంత్రి పొన్నం ప్రభాకర్ తనకు లీగల్ నోటీసులు పంపారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కౌశిక్ రెడ్డి తెలిపారు. వెంకటేశ్వరస్వామి గుడికి వచ్చి పొన్నం ప్రమాణం చేయాలని తాను సవాల్ చేశానన్నారు. ఫ్లైయాష్ వ్యవహారంలో జూబ్లీహిల్స్ వెంకటేశ్వరస్వామి గుడిలో ప్రమాణం చేద్దామని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కౌశిక్‌రెడ్డి సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మంగళవారం తన స్వగ్రామంలో దేవుడి సాక్షిగా ప్రమాణం చేశానని, పొన్నం రాలేదంటే అవినీతి చేసినట్టు అర్థమవుతోందన్నారు. బ్లాక్ బుక్‌లో మొదటి పేరు మంత్రి పొన్నం ప్రభాకర్‌దేనని కౌశిక్ రెడ్డి ప్రకటించారు. కెసిఆర్ అధికారంలోకి రాగానే పొన్నం ప్రభాకర్ తిన్న వంద కోట్ల అవినీతి కక్కిస్తామన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు స్కాములు చేసిందని, కానీ ఆరు గ్యారెంటీలు మాత్రం అమలు కావడం లేదని ధ్వజమెత్తారు. అవినీతికి పాల్పడుతున్న అధికారులకు మంత్రులకు మళ్లీ బ్లాక్ డేస్ రాక తప్పదని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News