మ్యాపిల్ లీఫ్స్ బ్యానర్ పై ఈవీ గణేష్ బాబు నిర్మించి, దర్శకత్వం వహించి కథానాయకుడిగా నటించిన చిత్రం కట్టిల్. సృష్టి డాంగే కథా నాయికగా నటించింది. పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ప్రదర్శించబడి అవార్డ్స్, రివార్డ్స్ తోపాటు ప్రశంసలందుకున్నఈ చిత్రం ‘పందిరిమంచం’ పేరుతో తెలుగులో విడుదల కాబోతుంది. తాజాగా ఈ చిత్రంలో ఫస్ట్ సింగిల్ కోవెలలో లిరికల్ సాంగ్ ని గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజా లాంచ్ చేశారు. పుష్ప సినిమా తర్వాత తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో సిద్ శ్రీరామ్ పాడిన పాట ఇది.
తన వాయిస్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశారు సిద్ శ్రీరాం. శ్రీకాంత్ దేవా సంగీతం సమకూర్చిన ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యం అందించారు. తరతరాలుగా ఒకే ఇంట్లో ఉన్న పందిరిమంచం కథ ఇది. ఒక వంశంలోని మూడు తరాల పరంపర గురించి అందర్నీ ఆకట్టుకునేలా ప్రజంట్ చేశారు. మాస్టర్ నితీష్, గీతకైలసం, సంపత్ రామ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఎడిటర్ బి లెనిన్ కథ, కథనం అందించగా, కె ఎన్ విజయకుమార్ మాటలు రాశారు.