- Advertisement -
న్యూఢిల్లీ : మనదేశానికి కొత్తగా వచ్చిన దౌత్యవేత్తలతో రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ బుధవారం వర్చువల్ విధానంలో సమావేశమయ్యారు. హోలీసీ, నైజీరియా ఫెడరల్ రిపబ్లిక్, ఆస్ట్రియా రిపబ్లిక్, కొరియా రిపబ్లిక్ దౌత్యవేత్తల క్రెడెన్షియల్స్‌ను స్వీకరించి వారిని అభినందించారు. భారత దేశంలో వారి పదవీ కాలం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ నాలుగు దేశాలతో భారత దేశానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. ఈ భారత్‌తోపాటు ఈ దేశాల ఉమ్మడి లక్షం శాంతి, సౌభాగ్యాలేనని తెలిపారు. ఈ దేశాల దౌత్యవేత్తలు కూడా తమ దేశాల నాయకత్వం తరఫున రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపారు.
Kovind Holds Virtual Ceremony With new diplomats
- Advertisement -