- Advertisement -
అందచేసిన రాష్ట్రపతి కోవింద్
ఢాకా: పాకిస్తాన్‌తో 1971లో జరిగిన విముక్త యుద్ధంలో అమరులైన భారత, బంగ్లాదేశ్ సైనికుల స్మారకార్థం నిర్వహించిన 50వ వార్షికోత్సవంలో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్‌కు 1971 నాటి మిగ్ 21 యుద్ధ విమాన నమూనాను బహూకరించారు. మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఇక్కడకు వచ్చిన కోవింద్ గురువారం బంగ్లాదేశ్ విముక్తి స్వర్ణోత్సవ వేడుకలలో విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. నాటి యుద్ధంలో పాల్గొన్న మిగ్ 21 అసలు విమానం బంగ్లాదేశ్ జాతీయ మ్యూజియంలో భద్రపరిచారని, ఆనాడు బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్తాన్‌తో జరిపిన యుద్ధంలో అమరులైన 1600 మంది భారత సాయుధ సిబ్బంది స్మారకార్థం తాము అందచేస్తున్న నివాళి అని భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా తెలిపారు.
- Advertisement -