Thursday, January 23, 2025

ఎన్‌ఐఎ చేతికి కోయంబత్తూరు పేలుడు కేసు

- Advertisement -
- Advertisement -

కోయంబత్తూరు: తమిళనాడులోని కోయంబత్తూరులో ఇటీవల జరిగిన కారు పేలుడు కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) గురువారం చేపట్టింది. ఈ నెల 23న తెల్లవారుజామున 4.30 ప్రాంతంలో కోయంబత్తూరులో ఒక మారుతీ 800 కారులో ఎల్‌పిజి సిలిండర్ పేలుడు సంభవించింది. కొట్టై ఈశ్వరన్ ఆలయ సమీపంలో జరిగిన ఈ పేలుడులో 25 ఏళ్ల జమేజా ముబిన్ అనే వ్యక్తి మరణించాడు. అదే రోజు సాయంత్రం రాష్ట్ర డిజిపి శైలేంద్ర బాబు విలేకరులతో మాట్లాడుతూ ఈ పేలుడు వెనుక కుట్ర కోణం దాగి ఉన్నట్లు వెల్లడించారు. ఉగ్ర దాడులలో పేలుళ్ల కోసం సాధారణంగా ఉపయోగించే మేకులు, గోలీలు, ఇతర వస్తువులు కారులో లభించినట్లు ఆయన తెలిపారు. మృతుడు ముబిన్ ఇల్లును సోదా చేయగా నాటు బాంబుల తయారీకి ఉపయోగించే తక్కువ తీవ్రతతో కూడిన పొటాషియం నైట్రేట్, అల్యూమినియం పొడి, బొగ్గు, సల్ఫర్ లభించినట్లు ఆయన చెప్పారు. కొన్ని సిసిటివి ఫుటేజ్‌ల ఆధారంగా ఐదుగురు వ్యక్తులను యుఎపిఎ కింద ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరిలో కొందరు గతంలో కేరళను సందర్శించారని, 2019లో వీరిని ఎన్‌ఐఎ ప్రశ్నించిందని కోయంబత్తూరు కమిషనర్ బాలకృష్ణన్ తెలిపారు. ఈ సంఘటనను ఆత్మాహుతి దాడిగా పోలీసులు పరిగణించాలని డిమాండు చేసిన తమిళనాడు బిజెపి అధ్యక్షుడు అన్నామలై దీనిపై ఎన్‌ఐఎ దర్యాప్తును కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News