Wednesday, January 22, 2025

కెపి చౌదరి పోలీస్ కస్టడీ…. సెలబ్రిటీల గుండెల్లో దడ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సినీ నిర్మాత కెపి చౌదరి అరెస్ట్‌తో సినీ నటులతో ఉన్న డ్రగ్స్ లింక్స్ వెలుగులోకి వస్తున్నాయి. సోమవారం కెపి చౌదరి కస్టడీపై తీర్పు వెలవడనుంది. సైబరాబాద్ పోలీసులు వారం రోజులు అతడిని కస్టడీలోకి తీసుకోనున్నారు. కెపి చౌదరి అరెస్ట్‌తో పలువురు సెలబ్రిటీల్లో గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కెపి చౌదరి ఉపయోగించిన నాలుగు మొబైల్స్‌ను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే పోలీసులకు వాట్సాప్ చాటింగ్, కాల్ డేటాను గుర్తించారు. కెపి చౌదరి నిర్వహించిన పార్టీలకు హాజరైన సెలబ్రిటీల పేర్లను పోలీసులు సిద్ధం చేశారు.

Also Read: పచ్చని యజ్ఞానికి పదేండ్లు!

డ్రగ్స్ కింగ్‌పిన్ నైజీరియన్ గాబ్రియల్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. గోవాలో గాబ్రియేల్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన తొమ్మిది మందిని గుర్తించారు. రాకేష్ రోషన్ అరెస్ట్‌తో గోవా, హైదరాబాద్ డ్రగ్స్ లింకులు బయటపడ్డాయి. డ్రగ్స్ కేసులో సినీ లింక్స్‌పై సైబరాబాద్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కెపి చౌదరి వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసిన సెలబ్రిటీలను పోలీసులు గుర్తిస్తున్నారు. గోవా నుంచి తెచ్చిన వంద ప్యాకెట్ల కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చౌదరిని విచారిస్తే సినీ పరిశ్రమలో డ్రగ్స్ లింకులు వెలుగు చేసే అవకాశం ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News