Friday, January 17, 2025

నేపాల్‌ ప్రధానిగా ప్రమాణ చేసిన కెపి శర్మ

- Advertisement -
- Advertisement -

ఖాట్మండూ: పొరుగుదేశం నేపాల్ ప్రధానిగా సోమవారం కెపి శర్మ ఓలి ప్రమాణస్వీకారం చేశారు. రాజకీయ అస్థిరతల ఈ దేశంలో ఆయన ప్రధాని కావడంఇది నాలుగోసారి. ఇటీవల పార్లమెంట్‌లో ప్రధాని ప్రచండ సారధ్యపు సంకీర్ణ ప్రభుత్వం బలపరీక్షలో ఓడింది.

దీనితో దేశాధ్యక్షులు రామ్ చంద్ర పౌడెల్ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని శర్మను ప్రధానిగా నియమించారు. ఈ క్రమంలో ఇప్పుడు ఓలి నాయకత్వంలో మరో సంకీర్ణ ప్రభుత్వం నేపాల్‌లో అధికారంలోకి వచ్చింది. నేపాల్‌లోని అతి పెద్ద కమ్యూనిస్టు పార్టీ సిపిఎన్ యుఎంఎల్ నాయకుడిగా ఓలి ఉన్నారు. పార్లమెంట్‌లో అత్యధిక స్థానాల బలం ఉన్న నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఇతర చిన్న పార్టీల మద్దతుతో కొత్త సంకీర్ణం ఏర్పడింది. 72 సంవత్సరాల ఓలి ప్రమాణస్వీకార కార్యక్రమం సోమవారం కొద్దిగా ఆలస్యం అయింది. నేపాలీ కాంగ్రెస్‌తో కమ్యూనిస్టు పార్టీ మంత్రుల పంపకాల విషయంలో సర్దుబాట్లలో కొంత మేరకు ప్రతిష్టంభన ఏర్పడింది.

తరువాత ఇది వీడిందని న్యూస్ పోర్టల్ మై రిపబ్లిక్ తెలిపింది. దేశ అధ్యక్షులు పౌడెల్ ప్రధాని ఓలి, ఇద్దరు ఉప ప్రధానులు ప్రకాశ్ మాన్ సింగ్, విష్ణు పౌడెల్‌తో, 19 మంది మంత్రులతో ప్రమాణం చేయించారని అధికార వర్గాలు తెలిపాయి. దేశ ఆర్థిక మంత్రిత్వశాఖను విష్ణు పౌడెల్ నిర్వర్తిస్తారు. నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షులు షేర్ బహద్దూరు దెవూబా భార్య అర్జూ రానా దేవుబా విదేశాంగ మంత్రి అవుతారు. ఇప్పటి కేబినెట్‌లో పది మంది నేపాలీ కాంగ్రెస్ వారు, ఎనమండుగురు సిపిఎన్ యుఎంఎల్ వారు , ఇద్దరు జనతా సమాజ్‌వాది పార్టీ వారు, ఒక్కరు లోక్‌తాంత్రిక్ సమాజ్ వాది పార్టీ వారు మంత్రులు అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News