Sunday, December 22, 2024

దివ్యాంగుల పాలిట దీనబంధువు సిఎం కెసిఆర్ : కెపి వివేకానంద్

- Advertisement -
- Advertisement -

కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఐడిపిఎల్‌లోని వైఎంఎస్ ఫంక్షన్ హాల్‌లో గురువారం దివ్యాంగులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ముఖ్య అతిధిగా పాల్గొని దివ్యాంగులకు రూ.3016/- పెన్షన్‌ను రూ.4016/-కు పెంచిన సందర్భంగా వారికీ మంజూరైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. సిఎం కెసిఆర్ దివ్యాంగుల పాలిట దేవుడని అన్నారు. ఇటీవల కాలంలో కన్న బిడ్డలే చూసుకొని ఈ తరుణంలో నెల నెల పెన్షన్ ఇస్తూ వెయ్యి రూపాయలు పెంచి వారికీ పెద్ద కొడుకుల సిఎం కెసిఆర్ అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే ఆనందాన్ని వ్యక్తం చేశారు.

అలాగే మంచి మమసున్న నాయకుడు మన సిఎం కెసిఆర్ అని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. అత్యధిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని. గత పాలకులు తెలంగాణ రాకముందు నెలకు రూ. 500 చొప్పున మాత్రమే అందించేవారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత స్వయంపాలనలో అర్హులైన దివ్యంగులను గుర్తించేందుకు చర్యలు చేపట్టిందని తద్వారా వారి సంఖ్య 5 లక్షల 11వేల 656 పెరిగిందని తెలిపారు.

నెలకు అందించే పింఛన్‌ను రూ. 3,016 నుంచి రూ. 4,016 కు పెంచిందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే దివ్యాంగులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ జిహెచ్‌ఎంసి జంట సర్కిల్ల డిప్యూటీ కమిషనేర్లు నాగమణి, మల్లా రెడ్డి, ప్రాసెసింగ్ ఆఫీసర్ హరి ప్రియా, మాజీ కార్పొరేటర్లు కెఎం గౌరీష్, బొడ్డు వెంకటేశ్వర రావు, బిఆర్‌ఎస్ పార్టీ డివిజన్ల అధ్యక్షులు, బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News