Wednesday, January 22, 2025

రోడ్లు, అభివృద్ధి పనులను పరిశీలించిన కెపి వివేకానంద్

- Advertisement -
- Advertisement -

జగద్గిరిగుట్ట: ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ 91వ రోజు ప్రగతి యాత్రలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 130 – సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని సూరారం కాలనీ, వి.డి.ఆర్ స్ట్రీట్, లూయిస్ బ్రెయిలీ వీధిలో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా పూర్తి చేసిన రోడ్లు, డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులు పరిశీలించారు. అదే విధంగా సం క్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కాగా తమ బస్తీల అభివృద్ధికి నిధుల కొరత లేకుండా ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించినందుకు కాలనీవాసులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు.

మిగిలి ఉన్న చిన్నపాటి పనులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఎమ్మెల్యే మిగిలిన పనుల కోసం వెంటనే వ్యయ ప్రణాళికలు రూపొందించి వాటిని పూర్తి చేయడానికి వెంటనే చర్య లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ మన్నే రాజు, మాజీ కౌన్సిలర్ బోబ్బా రంగా రావు, స్థానిక డివిజన్ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు పోలె శ్రీకాంత్, 129 డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, సంక్షమే సంఘం నాయకులు, సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News