Thursday, January 23, 2025

పుతిన్ ఆరోగ్యంగానే ఉన్నారు: రష్యా ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులను రష్యా ప్రభుత్వం మంగళవారం ఖండించింది. పుతిన్ సజీవంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

తనను పోలిన మనిషిని పుతిన్ ఉపయోగిస్తున్నట్లు వస్తున్న ఊహాగానాలను కూడా ప్రభుత్వ ప్రతినిధి డెమిట్రీ రెస్కోవ్ ఖండించారు. ఇవన్నీ కట్టుకథలని ఆయన తోసిపుచ్చారు. పుతిన్‌కు చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్య ఏర్పడిందని, ఆయన ఆదివారం సాయంత్రం గుండెపోటుకు గురయ్యారని కొన్ని పాశ్చాత్య మీడియాలలో వచ్చిన వార్తలను రష్యన్ విలేకరులు ప్రస్తావించగా అవన్నీ అవాస్తవాలని ఆయన స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News