Saturday, January 11, 2025

పుతిన్ క్షేమంగానే ఉన్నారు

- Advertisement -
- Advertisement -

మాస్కో: రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై కొద్దిరోజులుగా పలు ఆందోళనకర వార్తలు వెలువడుతూ వచ్చాయి. ఇది రష్యాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక విధాలుగా కలవరానికి దారితీశాయి. ఈ దశలో మంగళవారం రష్యా అధికారిక కేంద్రం క్రెమ్లిన్ నుంచి ప్రకటన వెలువడింది. పుతిన్ ఆరోగ్యంగా, చాలా బాగున్నారని, ఆయన ఆరోగ్యంపై వెలువడ్డ ఊహాగానాలను తోసిపుచ్చుతున్నామని ఇందులో స్పష్టం చేశారు. క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిట్రి పెస్కోవ్ పలు వార్తాసంస్థల ప్రతినిధులతో ఫోన్‌లో మాట్లాడారు.

పుతిన్ బయటకు వెళ్లినప్పుడు ఆయన లాగా ఉండే ఇతరులు(డూప్) కన్పిస్తుంటారని, నిజానికి పుతిన్ పరిస్థితి మరో విధంగా ఉందని వెలువడుతున్న వార్తలన్ని శుద్ధ అబద్ధం అని తేల్చిచెప్పారు. ఇవన్నీ బూటకపు వార్తలని ఈ ప్రతినిధి తెలిపారు. ఆదివారం సాయంత్రం పుతిన్ తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు, ఆయన పరిస్థితి డౌటుగానే ఉందని తెలియచేస్తూ రష్యన్ టెలిగ్రాఫ్ ఛానల్ ఓ అనధికారిక వార్త వెలువరించింది. తమకు పశ్చిమ దేశాల మీడియా నుంచి ఈ సమాచారం అందిందని ఇందులో తెలిపారు. వీటిని ఖండిస్తున్నట్లు రష్యా అధికార వర్గాలు ఇప్పుడు స్పష్టం చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News