Saturday, December 21, 2024

సినీ నిర్మాణ రంగంలో స‌రికొత్త సంచ‌ల‌నం

- Advertisement -
ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ కె.ఆర్‌.జి స్టూడియోస్ 6వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. మ‌రో అగ్ర నిర్మాణ సంస్థ టి.వి.ఎఫ్.మోష‌న్ పిక్చ‌ర్స్‌తో చేతులు క‌లిపింది. ఈ రెండు భారీ ప్రొడ‌క్ష‌న్ హౌసెస్ ద‌క్షిణాది భాష‌ల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి సారించాయి. వీరిద్ద‌రూ భాగ‌స్వామ్యులుగా విలువ‌ల‌తో కూడిన వైవిధ్యమైన సినిమాల‌ను రూపొందించ‌టానికి సిద్ధ‌మ‌య్యారు.
సినీ రంగంలో ఓ సరికొత్త మార్పును తీసుకు రావ‌టానికి కె.ఆర్‌.జి.స్టూడియోస్ సిద్ధ‌మైంది. అందులో భాగంగా వైవిధ్య‌మైన క‌థాంశాల‌ను సిద్ధం చేసి వాటిన ప‌క్కా ప్ర‌ణాళిక‌తో సినిమాగా రూపొందించి ప్రేక్ష‌కుల‌కు అందించ‌ట‌మే ల‌క్ష్యంగా పెట్టుకుంది. యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌టం వ‌ల్ల  కొత్త ఆలోచ‌న‌లతో క‌థ‌లు, సినిమాలు రూపొందుతాయ‌న‌టంలో సందేహం లేదు. ఈ సంద‌ర్భంగా..
కె.ఆర్‌.జి.స్టూడియోస్ అధినేత కార్తీక్ గౌడ మాట్లాడుతూ “ఆరేళ్ల క్రితం క‌న్న‌డతో పాటు ఇత‌ర ప్రాంతీయ భాష‌ల్లో వైవిధ్య‌మైన, అర్థ‌వంతమైన‌ సినిమాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించాల‌నే ఉద్దేశంతో కె.ఆర్‌.జి.స్టూడియోస్‌ను ప్రారంభిచాం. అందుకోసం స్టోరీ డెవ‌ల‌ప్‌మెంట్, ప్ర‌క్కా ప్రణాళిక‌తో దాన్ని అమ‌లు చేయ‌టం, గ్రాండ్‌గా సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయ‌టంపై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టాం. కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌ట‌మే మా ఆలోచ‌న‌. అందుకోసం టి.వి.ఎఫ్ వంటి మ‌రో అగ్ర నిర్మాణ సంస్థ‌తో భాగ‌స్వామ్యం అయ్యాం. మీడియా మ‌రియు ఎంట‌ర్‌టైన్మెంట్‌లో అనుభ‌వ‌జ్ఞుడైన విజ‌య్ సుబ్ర‌మ‌ణ్యం ఈ ప్ర‌యాణంలో భాగ‌మైనందుకు ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాం“ అన్నారు.
టి.వి.ఎఫ్ వ్య‌వ‌స్థాప‌కుడు అరుణ‌భ్‌కుమార్ మాట్లాడుతూ “సినీ రంగంలో  వైవిధ్య‌మైన క‌థ‌ల‌ను ప్రేక్ష‌కుల‌కు అందుబాటులోకి తీసుకుని రావ‌టమే స్ఫూర్తిగా మా ప్ర‌యాణాన్ని ప్రారంభించాం. ర‌త్న‌న్ ప్ర‌పంచ‌, గురుదేవ్ హోయ‌శాల వంటి చిత్రాల‌ను నిర్మించిన సంస్థ‌తో చేతులు క‌ల‌ప‌టంపై చాలా ఆనందంగా ఉంది. డిఫ‌రెంట్ క‌థాంశాల‌తో క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందిస్తాం“ అన్నారు. టీవీఎఫ్ అధ్యక్షుడు విజయ్ కోషీ మాట్లాడుతూ.. ‘మేం నిరంతరం రియలిస్టిక్ సినిమాలు, సహజత్వంతో కూడిన కథలను చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాం.  ప్రాంతీయ సరిహద్దులను చెరిపి పాన్ ఇండియన్ లెవెల్లో సక్సెస్ అయిన కేఆర్‌జీతో ప్రస్తుతం మేం కలిసి పని చేసేందుకు సిద్దమయ్యాం. మా రెండు సంస్థలో క్రియేటివిటీ అనేది కామన్‌గా ఉంది. ఇకపై మా రెండు సంస్థలు కలిసి అద్భుతమైన కథలను ప్రేక్షకులకు అందిస్తామ’ని అన్నారు.
టీవీఎఫ్ గురించి..
టీవీఎఫ్‌ను అరునభ్ కుమార్ స్థాపించి దాదాపు దశాబ్దం కావొస్తుంది. టీవీఎఫ్ అప్పటి వరకు వచ్చిన సినిమాలను, కథలను చెప్పే విధానాన్ని మార్చేసింది. ప్రస్తుతం యువతరం అభిరుచికి తగ్గట్టుగా చిత్రాలు నిర్మిస్తూ వచ్చింది. మీడియా అవుట్ లెట్స్, ప్రొడక్షన్ కంపెనీలను ప్రారంభించింది. ఇండియాలో అత్యున్నతమైన వెబ్ కంటెంట్‌ను ఇవ్వడంతో టీవీఎఫ్ ముందుంటుంది.
కేఆర్‌జీ గురించి..
కార్తీక్ గౌడ, యోగి జీ రాజ్ సంయుక్తంగా ఈ సంస్థను ఆరేళ్ల క్రితం స్థాపించారు. కన్నడ ప్రేక్షకులకు అద్భుతమైన, గొప్ప కథలను అందించేందుకు ప్రారంభించారు. ఇది వరకు ఎన్నడూ చూడని భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూ వస్తోంది. కన్నడలోని గొప్ప కథలను ప్రేక్షకులకు అందిస్తుంది.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News