- Advertisement -
హైదరాబాద్: కూకట్‌పల్లి నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సహకారంతో 90 శాతం అభివృద్ధి చేశామని ఎంఎల్‌ఎ కృష్ణారావు తెలిపారు. కూకట్‌పల్లి ఫతేనగర్‌లో బిఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో కృష్ణారావు మాట్లాడారు. కన్నతల్లి లాంటి పార్టీకి ఈటెల రాజేందర్, మహేందర్ రెడ్డి వంటి వారు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. మల్కాజ్‌గిరి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపిగా ఉన్నప్పుడు ఒక్క రూపాయైనా తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. ఎంపిగా గెలిచిన రేవంత్ ఒక్క రోజు కూడా నియోజకవర్గ సమస్యలు తెలుసుకోలేదని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని కృష్ణారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ మాధవరం కృష్ణారావు, మల్కాజ్‌గిరి బిఆర్‌ఎస అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -