Sunday, April 13, 2025

ఏడేళ్ల కుమారుడితో తండ్రి ఆత్మహత్య… సారీ బావ

- Advertisement -
- Advertisement -

అమరావతి: అప్పుల బాధతో ఐస్‌క్రీమ్‌లో సైనైడ్ కలిపి తన కుమారుడికి ఇచ్చి తండ్రి తిని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా పెనమలూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. యనమలకుదురులో వేమిరెడ్డి సాయి ప్రకాశ్ రెడ్డి(33), లక్ష్మీ భవాని అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతుకలు కుమార్తె తక్షిత, కుమారుడు తక్షిత్(07)లు ఉన్నారు. భార్య మెడికల్ షాపులో పని చేసేవారు. సాయి ప్రకాశ్ రెడ్డి విజయవాడ పాత బస్తీలో జువెల్లరీ షాపు నిర్వహించేవాడు. కరోనా సమయంలో వ్యాపారం సాగకపోవడంతో ఆర్థికంగా నష్టపోయారు. అప్పులు ఎక్కువగా కావడంతో తన కుటుంబ సభ్యులకు చెప్పాడు. వారు కొంచెం అప్పును తీర్చారు. అప్పుల ఊబి నుంచి మాత్ర బయటకు రాలేదు.

రోజు రోజు అప్పుల వాళ్ల బాధలు పడలేక తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. లక్ష్మీ భవాని తన భర్తకు దైర్యం చెప్పిన కూడా అతడిలో మాత్రం మార్పు రాలేదు. భార్య మెడికల్ షాపుకు వెళ్లగా భర్త సాయి ప్రకాశ్ రెడ్డి, కుమారుడు ఇంట్లో ఉన్నారు. సైనైడ్ కలిపిన ఐస్‌క్రీమ్ కుమారుడికి ఇచ్చి తాను ప్రకాశ్ తిన్నాడు. ఐస్‌క్రీమ్ తిన్న తరువాత ఇద్దరు స్పృహ కోల్పోవడంతో ఇరుగుపొరుగు వారిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా ఇద్దరు చనిపోయారు. ప్రకాశ్ రెడ్డి తన భావ విజయ్‌కు సెల్‌ఫోన్‌లో సందేశం పంపారు. ‘సారీ బావా… నేను తక్షిత్ సైనైడ్ తీసుకున్నాం’ అనే సందేశం పంపారు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. యనమలకుదురులో విషాదచాయలు అలుముకున్నాయి. భార్య లక్ష్మీభవాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News