Wednesday, January 22, 2025

శివన్నగూడెంకు కృష్ణా జలాలు తెస్తా

- Advertisement -
- Advertisement -

డబ్బుతో వచ్చే బేహారీలను నమ్మొద్దు
మునుగోడు సభలో కెసిఆర్ ఫ్లోరైడ్
సమస్యను పరిష్కరించింది ఒక్క మా
ప్రభుత్వమే ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్

మన తెలంగాణ/మనుగోడు: మునుగోడు ఉప ఎన్నికల్లో ఇచ్చిన తీర్పునే ప్రజలు మరోసారి పునరావృతం చేయాల ని ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మునుగోడు మండల కేంద్రంలో ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మునుగోడు ని యోజకవర్గానికి ఉప ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను 90శాతం పూర్తి చేశామన్నారు. చండూరులో ఆర్డీవో డివిజన్ ఏర్పాటు, చౌటుప్పల్‌లో 100 పడకల ఆసుపత్రి వంటివి మీ కళ్ల ముందు కనబడుతున్నాయన్నారు.

శివన్నగూడెంకు డిండి కాలువ ద్వారా కృష్ణా జలాలు తరలించి 2.50లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తానని ఆయన అ భయం ఇచ్చారు.24గంటల కరెంటు దేశ ప్రధాని సొంత రాష్ట్రంలో కూడా ఇవ్వడం సాధ్యం కావడం లేదన్నారు. గతంలో ఫ్లోరైడ్‌తో నడుములు వంగిపోయి నివారణ దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మన నియోజకవర్గానికి చెందిన అంశాల స్వామిని అప్పటి ప్రధాని వాజ్‌పేయి ప డుకోబెట్టినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఫ్లోరైడ్ సమస్యను పూర్తిగా నివారించామన్నారు.

మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గత 24 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో నాతో ఉన్నాడని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జరిగిన ఉద్యమాలలో భాగంగా జైలుకు వెళ్లివచ్చిన చరిత్ర కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిది అన్నారు. పూటకోపార్టీ మార్చే నాయకులను నమ్మొద్దని హితవు పలికారు. డబ్బుల సంచులతో వచ్చి మాయ మాటలు చెప్పేవారితో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. రాజకీయ బెహరీలను తరిమికొట్టాలని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మరో20 సంవత్సరాలు వెనుకకు వెళుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ , మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ సభాపతి మధుసూదనాచారి, కల్లుగీత సొసైటీ రాష్ట్ర చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్, యాదాద్రి భువనగిరి జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, మునుగోడు శాసన సభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి , ఎంపిపి కర్నాటి స్వామి యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు బండా పురుషోత్తంరెడ్డి, ప్రధాన కార్యదర్శి పగిళ్ల సతీష్, నాయకులు పోలగోని సైదులుగౌడ్, పాల్వాయి గోవర్థన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News