Monday, December 23, 2024

కృష్ణ మరణం చలనచిత్ర రంగానికి తీరని లోటు: సిఎం కెసిఆర్‌

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్‌ : సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని కృష్ణ మరణంపై తెలంగాణ సిఎం కెసిఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. కృష్ణ మరణం తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని సిఎం అన్నారు. నటుడిగా, నిర్మాత, దర్శకుడిగా, నిర్మాణ సంస్థగా ఐదు దశాబ్దాల పాటు కృష్ణ అందించిన సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. 350కి పైగా చలన చిత్రాల్లో నటించిన ఆయన సినీ ప్రేక్షకుల్లో చెలగరని ముద్ర వేశారన్నారు. టాలీవుడ్ లో విభిన్న కుటుంబ కథా చిత్రాలతో పాటు ప్రజల్లో సామాజిక స్పృహ కల్పించే సాంఘిక చిత్రాల నటుడిగా కృష్ణ జనాదరణ పొందారని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News