Monday, January 20, 2025

నీలి చిత్రాల్లో లాగా చేయమని భార్యను వేధిస్తున్న భర్త

- Advertisement -
- Advertisement -

అమరావతి: భార్యను నీలి చిత్రాల్లో లాగా సంభోగం చేయమని భర్త ఒత్తిడి చేయడంతో పాటు అదనపు కట్నం కోసం వేధిస్తున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా పటమట పోలీస్ స్టేషన్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. 2021లో యువతి-యువకుడు పెళ్లి చేసుకున్నారు. వివాహం జరిగినప్పుడు రెండు లక్షల రూపాయలు, రూ.50 వేల విలువైన గృహోపకరణాలు అత్తింటి వారు అల్లుడికి ముట్టజెప్పారు.

కృష్ణా జిల్లాలోని కూచిపూడిలో ఓ కిరాణా హోల్‌సేల్ షాపును భర్త నిర్వహిస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి అదనపు కట్నం తీసుకరావాలని వేధింపులకు గురి చేస్తున్నాడు. దీనికి అత్త, మరదలు వత్తాసు పలుకుతుండడంతో భర్త ఇంకా ఎక్కువ వేధింపులకు గురిచేశాడు. తన దుకాణంలో పని చేసే యువతితో భర్త అక్రమసంబంధం పెట్టుకోవడంతో పలుమార్లు అతడిని భార్య నిలదీసింది. చరవాణిలో నీలి చిత్రాలు చూపించి సంభోగం చేయమని పలుమార్లు భర్త ఒత్తిడి తీసుకవచ్చాడు. రోజు రోజుకు భర్త వేధింపులు పెరగడంతో ఆమె తన పుట్టింటికి వచ్చింది. దిశ పోలీసులు ఆమె ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News