Thursday, January 23, 2025

కుమారుడిని చంపిన తల్లి.. అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు

- Advertisement -
- Advertisement -

అమరావతి: వావివరసలు మరిచి తల్లితో అసభ్యంగా ప్రవర్తించిన కుమారుడిని ఆమె రోకలి బండతో కొట్టి చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా గుడివాడ ప్రాంతంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. గండికోట పద్మ అనే మహిళకు రెండో కుమారుడు రాంబాబు ఉన్నాడు. రాంబాబు భవన కార్మికుడిగా పని చేస్తున్నాడు. గత రెండు సంవత్సరాల నుంచి మద్యానిగా బానిగా మారి తల్లిని పలుమార్లు వేధించాడు. రోజు రోజుకు వేధింపులు ఎక్కువగా కావడంతో ఆమె బరించలేకపోయింది.

ఈ నెల 16న రాత్రి ఇంటికి వచ్చిన కుమారుడు తల్లితో అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లి అతడి నుంచి తప్పించుకొని బయటకు వెళ్లిపోయింది. అనంతరం ఇంటికి వచ్చిన తరువాత కుమారుడు గాఢ నిద్రలో ఉన్నాడు. వెంటనే రోకలి బండ తీసుకొని కుమారుడి తలపై తల్లి పలుమార్లు బాదడంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. వెంటనే తాడు తీసుకొని కాళ్లు, చేతులు కట్టేసి తన కుమారుడిని చంపేశారని అందరిని నమ్మించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో ఆమె చెబుతున్న విషయాలకు పొంతనలేకపోవడంతో ఆమెను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు నిజాలు బయటకు వచ్చాయి. తానే హత్య చేశానని ఒప్పుకుంది. వెంటనే ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును చేధించిన పోలీసులను డిఎస్‌పి శ్రీకాంత్ అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News