Monday, December 23, 2024

ఆ యాప్ తో మోసపోయా బావ… పుట్టెడు దు:ఖంతో సెల్ఫీ వీడియో…. ఉరేసుకుంది

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆన్‌లైన్ లోన్ యాప్‌తో మోసం జరగడంతో ఓ వివాహిత తన భర్తకు సెల్ఫీ వీడియో పంపించి ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా పమిడి ముక్కల మండలం మంటాడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరా ప్రకారం… మంటాడలో గ్రామంలో శ్రీకాంత్(32), స్రవంతి(28) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కుమార్తె(06), కుమారుడు(04) ఉన్నాడు. శ్రీకాంత్ తాపీ మేస్త్రీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఫోన్‌లో ఐదు లక్షల రుణం ఇస్తామని సందేశం రావడంతో కుటుంబానికి డబ్బులు ఉపయోగపడుతాయని ఆ నంబర్‌కు పోన్ చేసింది. రుణం కోసం తొలుత రూ.20 వేలు చెల్లించాలని లోన్ యాప్ వాళ్లు అడిగారు.

దీంతో రూ.20 వేలు ఆన్‌లైన్‌లో చెల్లించింది. తరువాత మళ్లీ రూ.60 వేలు, రూ.80 వేలు చెల్లించమని అడగడంతో లక్ష రూపాయలు అప్పు తెచ్చి చెల్లించింది. చివరగా లక్ష ఇరువై వేలు చెల్లిస్తే రుణం ఇస్తామని చెప్పడంతో ఇక కట్టలేనని చెప్పింది. దీంతో ఆమె మోసపోయానని గ్రహించి భర్తకు చెప్పుకోలేకపోయింది. తప్పు జరిగిపోయింది బావ తనని క్షమించాలని ఏడుస్తూ సెల్పీ వీడియో తీసి పోస్టు చేసింది. అనంతరం ఆమె తన ఇంట్లో ఉరేసుకుంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయిందని పరీక్షించిన వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్లలో వచ్చే లోన్ యాప్‌లను నమ్మవద్దని పదే పదే చెబుతున్న ప్రజలు అర్థం చేసుకోవడంలేదని పోలీసులు తెలిపారు. ఇప్పుకైనా లోన్ యాప్‌లతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News