Sunday, December 22, 2024

మామిడాకులు కోశాడని కత్తితో పొడిచారు…

- Advertisement -
- Advertisement -

అమరావతి: తనని అడగకుండా మామిడాకులు కోశాడని ఓ వ్యక్తిని యజమాని కత్తితో పొడిచిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా యనమలకుదురులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అర్జున్ రావు అనే వ్యక్తి యనమలకుదురు గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లాడు. గ్రామంలో మామిడాకుల కోసం వెళ్తుండగా మామిడి చెట్టు కనిపించడంతో ఆకులను కోశాడు. యజమాని గమనించి తనని అడగకుండా ఎందుకు మామిడాకులు కోశావని ప్రశ్నించడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో కత్తి తీసుకొని అర్జున్ రావుపై యజమాని దాడి చేశాడు. అతడు తీవ్రంగా గాయపడడంతో గ్రామస్థులు ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News