Monday, December 23, 2024

ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: సినీనటుడు కృష్ణ పార్థివదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌కు సూచనలు చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సూపర్‌స్టార్‌ కృష్ణ పార్థివదేహాన్ని కాంటినెంటల్‌ ఆసుపత్రి నుంచి నానక్‌రాంగూడలోని నివాసానికి తరలించారు. సాయంత్రం 5గంటల తర్వాత అభిమానుల సందర్శనార్థం గచ్చిబౌలి స్టేడియానికి తరలించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం కానుంది. గచ్చిబౌలి స్టేడియం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర సాగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News