Thursday, January 23, 2025

మంగళ హారతులు పట్టి కృష్ణాను అప్పగించిన్రు

- Advertisement -
- Advertisement -

పచ్చబడ్డ తెలంగాణను కరగనాకడమే లక్ష్యంగా విపక్షాల కుతంత్రాలు

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ బ్యూరో/గద్వాల/మఖ్తల్/నారాయణపేట: రాయలసీమ నేతలకు మంగళ హారతులు పట్టి కృష్ణా జలాలను వారికి అప్పగించిన హీన చరిత్ర కాం గ్రెస్ నేతలదని బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి రాయలసీమ నేత రఘువీరారెడ్డి వస్తే ఆయనకు హారతులు పట్టి అనంతపూరానికి కృష్ణా జలాలను తరలించుకుపోవడానికి అనుమతించారని వివరించారు. పచ్చబడ్డ తెలంగాణను కరగనాకడమే లక్ష్యంగా కాంగ్రెస్ కుట్రలు పన్నుతున్నదని ఆరోపించారు. దళారులు, అవినీతి లేకుండా రైతులు దర్జాగా కాళ్ల మీద కాళ్లు వేసుకొని ఉండేలా భూముల రక్షణకు ధరణిని తీసుకొచ్చాం.. కాంగ్రెస్ వాళ్లు ధరణిని తీసేస్తాం అంటున్నారు. ధరణి తీసేస్తే రైతుబంధు డబ్బులు రావు, రైతు బీమా రా వు.. అందుకే ధరణిని తీసేద్దామన్న కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో వేయాలని ముఖమంత్రి కెసిఆర్ పిలుపునిచ్చారు.

తెలంగాణను 40ఏళ్ల పాటు ఆగం చేసిన కాంగ్రెస్ పార్టీ కావాలో, ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ ను సాధించిన బిఆర్‌ఎస్ పార్టీ కావాలో దయచేసి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ మధ్యన పిసిసి చీఫ్‌లు ఉత్తంకుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి కరెంట్‌పై మాట్లాడుతున్నారని రైతులకు మూడు గంట ల కరెంట్ చాలని.. కెసిఆర్ కరెంట్‌ను దుబా రా చేస్తున్నాడని అంటున్నారన్నారు. నేను ఆ గం చేస్తున్నానా? నాకు కాపుదనం ఉంది.. వ్యవసాయం ఉంది…కరెంట్ లేక చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సం ఘటనలు చూశామని అవన్ని ఉండకూడదని రైతులకు 24 గంటలు కరెంటు ఇస్తున్నామని కెసిఆర్ అన్నారు. మరోవైపు రాహుల్ గాంధీ వ్యవసాయం గురించి మాట్లాడితే నవ్వొస్తుందని ఆయనకేమైనా ఎద్దులు ఉన్నాయా? వ్యవసాయం ఉందా అని ప్రశ్నించారు. ధరణిని ర ద్దు చేస్తే తిరిగి దళారులు, పైరవీకారులు, లం చగొండులు పెరిగిపోతారన్నారు. దయచేసి ఆలోచించాలని ఆయన సూచించారు. ధరణి ని రద్దు చేసే పార్టీలకు ఓటేస్తే ఆగమైతామని కెసిఆర్ అన్నారు. సోమవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో దేవరకద్ర, గద్వాల, మఖ్తల్, నారాయణపేటలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్ పాల్గొని ప్రసంగించా రు. ప్రజాస్వామ్యంలో మనం ఆశించిన పరిణితి మన దేశంలో రావడం లేదని, ఎక్కడెక్కడైతే పరిణితి వచ్చిందో ఆ దేశాలో చాలా గొప్పగా అభివృద్ధ్దిలో దూసుకుపోతున్నాయని కెసిఆర్ తెలిపారు.

చాలాసార్లు ఎన్నికలు వస్తూ పోతుంటాయని, ప్రతి పార్టీ నుంచి ఒక అభ్యర్థ్ధి ఉంటారని, అందులో మేలు చేసే వ్యక్తి ఎవరు? అభ్యర్థుల వెనుక ఒక పార్టీని, ఆ పా ర్టీ నడవడిక ఏంది?, విధానం ఏంది ? ప్రజల గురించి ఆ పార్టీ సరళి ఏంది… పేదల గు రించి.. రైతుల గురించి ఏమి ఆలోచిస్తరు ..అధికారం అప్పగిస్తే ఏ విధం గా పరిపాలన చేస్తరు అనే చరిత్ర కూడా మీ కళ్ల ఉందన్నారు. మీ దగ్గర ఉన్న ఒకే ఒక వజ్రాయుధం మీ ఓటు ఐదేళ్ల పాటు మీ భవిష్యత్‌ను రాస్తుందని, ఆషామాషిగా అలోకుగా ఓటెయ్యద్దని అన్నారు. ఎవరుంటే మంచిదో? ఎవరు ద్వారా మేలు జరుగుతుందో, రాష్ట్రానికి, ప్రజలకు, రైతులకు సమాజానికి మేలు జరుగుతుందో అలాం టి వారు గెలిస్తే మీరు గెలిచినట్లేనని కెసిఆర్ అన్నారు. ప్రజలు గెలిపించే వారు గెలిస్తే అది నిజమైన ప్రజాస్వామ్యమని అన్నారు. విచక్షణతో ఆలోచించి మీ గ్రామాల్లో చర్చ పెట్టి ఆలోచించి ఓటెయ్యాలని కోరారు.
పాలమూరును ఆగం చేసింది కాంగ్రెస్ కాదా?
పాలుగారిన జిల్లాగా ఉన్న పాలమూరు జిల్లాను సమైక్య రాష్ట్రంలో ఏ గతి పట్టించారో మీ కందరికి తెలుసని, ఆ నాడు ముఖ్యమంత్రులుగా ఉన్న వారు దత్తత తీసుకుంటామని చెప్పి పునాది రాళ్లు వేశారు తప్ప కాసిన్ని నీళ్లు ఇవ్వలేదని కెసిఆర్ దుయ్యబట్టారు. పంటలు ఎండిపోయి, వలవల ఏడ్చినా వలసలు పోయినా మన పాలమూరు జిల్లాను ఎవడు పట్టించుకోలేదని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మన గోసను, కన్నీళ్లు ఏ పార్టీ పట్టించుకోలేదని చెప్పారు. కొన్ని పార్టీలు ఇక్కడికి వచ్చి గంజి కేంద్రాలు పెట్టే దుస్థ్దితి ఉండేదన్నారు. కృష్ణా, తుంగభద్ర నదులు ఒరుసుకుంటు పారే ఈ జిల్లాలో గంజి కేం ద్రాలు పెట్టించే గతి ఏ పార్టీ కల్పించిందో దయచేసి ఆలోచించాలని పరోక్షంగా కాంగ్రెస్‌ను ఉద్దేశించి అన్నారు. 40 ఏళ్ల కాలంలో పాలమూరును ఆగం చేసిన పార్టీ కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. ఉన్న తెలంగాణాను ఊడగొట్టి ఆంధ్రప్రదేశ్‌లో కలిపి సమైక్య రాష్ట్రంలో కలిపి సమైక్య పాలకులు మన ప్రాజెక్టులను రద్దు చేశారని కెసిఆర్ ఆరోపించారు. ఒక్క ప్రాజెక్టుపై కూడా ఏ కాంగ్రెస్ నాయకుడు అడగలేదని విమర్శించారు. 1974 బచావ త్ ట్రిబ్యునల్ నది నీళ్ల పంపకం చేస్తే తెలంగాణా ప్రాం తంలో ఉన్న మంత్రులు, కాని ఎమ్మెల్యేలు కాని పాలమూరుకు ఎన్ని నీళ్లు ఇస్తున్నారని అడగలేదన్నారు. తా ను చెప్పింది అబద్ధ్దం కాదని, బచావత్ ట్రిబ్యునల్ రికార్డులలో ఉందని, రాజకీయం కోసం చెప్పడం లేదన్నారు. ఇప్పుడు కూడా రికార్డులను చదివితే అందులో ఉందని అన్నారు. ఈ ప్రాంతం ఆంధ్రప్రపదేశ్‌లో కలపకపోయి ఉంటే చాలా బాగుపడి ఉండేదని, ఎపిలో కలపడం వలన చాలా నష్టపోయిందని రికార్డులలో రాసి ఉందన్నారు. తమకే ఎలాగో ఉందని భావించిన ట్రిబ్యునల్ జూరాలకు 17 టిఎంసిల నీటిని కేటాయించిందన్నారు. కనీసం జూరాలపై ఎలాంటి కట్టడం కట్టలేదని చెప్పారు. తిరిగి మన తెలంగాణా బిడ్డ ముఖ్యమంత్రి అంజయ్య శంకుస్ధాపన చేస్తే తప్ప ఆ ప్రాజెక్టు ముందరపడలేదని తెలిపారు. 2001 సంవత్సరం దాక కర్నాటక రైతులకు నష్టపరిహారం ఇవ్వకపోవడంతో ఆ ప్రాజెక్టు పనులు ముందుకు సాగలేదన్నారు. చివరికి 2001లో గులాబీ జెండా పార్టీ వచ్చిన తర్వాత కర్నాటకకు నష్టపరిహాం అందిన తర్వాతనే ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. పాలమూరును అన్యాయం చేసిన పార్టీ ఏదంటే అది కాంగ్రెస్ పార్టీ అని ఆయన ఎద్దేవా చేశారు. నేను చెప్పింది నిజమా కాదా ఆలోచించాలని, ఒక వేళ నిజం కాకపోతే మమ్ముల్ని ఓడించాలని కెసిఆర్ ప్రజలకు సూచించారు.
పిడికెడు మందితో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినం
పిడికెడు మందిమి వచ్చి తిరిగి యావత్ తెలంగాణాను లేపితే మీరందరు ఉద్యమం చేస్తే అది కూడా కాంగ్రెస్ ఢోకా చేసిందని విమర్శించారు. 2004లో తమతో పొత్తుపెట్టుకొని తెలంగాణా ఇస్తామని చెప్పి అక్కడ ఇక్కడ అధికారం చేజిక్కించుకున్న తర్వాత కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎలా చెబితే ఆల తల ఊపుతూ బిఆర్‌ఎస్‌ను ముంచే కార్యక్రమం చేశారని, ఆలాగే ఎమ్మెల్యేలను కొనే కార్యక్రమం చేశారని అన్నారు. తిరిగి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తే తిరిగి తాను తెలంగాణా వచ్చుడో కెసిఆర్ సచ్చుడో అని ఆమరణ దీక్ష చేపడితే మొండి పట్టుదలతో ఉద్యమాన్ని నడిపితే 2014లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్ర ప్రకటన చేయక తప్పలేదన్నారు. తిరిగి ఏడా ది వరకు ఇవ్వక పోతే తిరిగి తాను 33పార్టీల మద్దతు కూడగట్టి ఇదంతా చేస్తే 14 సంవత్సరాల తర్వాత 15 ఏటా తెలంగాణా ఇచ్చారని చెప్పారు. తెలంగాణా వచ్చి న తరువాత పాలమూరు మీరు చూసే ఉంటారని, వెం టనే పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ పట్టినట్లుగా పూర్తి చేసుకున్నామని కెసిఆర్ తెలిపారు, మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్ రెడ్డి, లకా్ష్మరెడ్డిలు పట్టుబట్టి నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి పూర్తి చేసుకున్నామని చెప్పారు. కోయిలసాగర్ కూడా ఎమ్మెల్యే ఆల కృషితో పూర్తి చేసుకున్నామని చెప్పారు. త్వరలో పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్ పూర్తి కాబోతుందని, ఇటీవలనే స్విచ్ ఆన్ చేసుకున్నామన్నారు. కర్వేన రిజర్వాయర్ కోసం నేను గుట్టులు తిరిగి నిర్మించామని, ఇప్పడున్న 90 వేల ఆయికట్టు కాకుండా కర్వేన పూర్తి అయితే మరో 60 వేల ఎకరాలకు ఆయికట్టు వస్తుందన్నారు. రాష్ట్రంలో ఉన్న వాల్మీ కి బోయలు ఆనాడు ఎస్‌టిలో ఉన్నారని, బోయలు రాజకీయంగా ఆర్థ్దికంగా ఎదగకూడదనే ఉద్దేశంతో ఆ నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి బోయలను బిసిలో కలిపారని చెప్పారు. గతంలో గద్వాలను గబ్బు పట్టించింది ఎవరో మీకు తెలుసని, బిఆర్‌ఎస్ వచ్చిన తర్వాత గద్వాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో ఆల వెంకటేశ్వర్ రెడ్డి అడిగిన అన్ని హామీలను వచ్చే ప్రభుత్వంలో మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.మంత్రి శ్రీనివాస్‌గౌడ్, దేవరకద్ర ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మఖ్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మోహన్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News