Thursday, January 23, 2025

కృష్ణా, గోదావరి పరవళ్లు

- Advertisement -
- Advertisement -

త్వరలో తుంగభద్ర గేట్ల ఎత్తివేత
దిగువన లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం
తెలుగు రాష్ట్రాలకు బోర్డు హెచ్చరికలు జారీ
శరవేగంగా నిండుతున్న ఆల్మట్టి

నేడో రేపో తుంగభద్ర గేట్లు ఎత్తివేత
దిగువన లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం
తెలుగు రాష్ట్రాలకు బోర్డు హెచ్చరికలు జారీ
శరవేగంగా నిండుతున్న ఆల్మట్టి

మనతెలంగాణ/హైదరాబాద్ :ఎడతెరిపిలేకండా కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా-గోదావరి నదులు వరదనీటితో పరవళ్లు తొక్కుతున్నాయి. కృష్ణానదికి ప్రధాన ఉపనదిగా ఉన్న తుంగభద్ర ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుకుంటోం ది. జలాశయంలో నీటిమట్టం గరిష్టస్థాయికి చేరువవుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. నేడో రేపో తుంగభద్ర ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసే అవకాశాలు ఉన్నట్టు బోర్డు అధికారులు వెల్లడించారు.శుక్రవారం కర్ణాటక సిఎం బొమ్మె భారీవరదలపై సమీక్ష నిర్వహించి ముందుజాగ్రత్త చర్యలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సీఎం హెచ్చరికల మేరకు ప్రాజెక్టు దిగువన తుంగభద్ర నదీతీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

అంతే కాకుండా తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కూడా వరద హెచ్చరికలు జారీ చేశారు. నది పరివాహకంగా ఇరువైపులా ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని బోర్డు అధికారులు తెలుగురాష్ట్రాలకు సూచించారు. కర్ణాటకలో కురుస్తున్న కుండపోత వర్షాలతో తుంగా జలాశయం ఇప్పటికే పూర్తి స్థాయిలో నిండిపోయింది. ఎగువ నుంచి తుంగా జలాశయంలోకి 54303క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసి దిగువన నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు భద్ర జలాశయంలోకి కూడా ఎగువ నుంచి 30వేల క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. ఈ ప్రాజెక్టుగేట్లు కూడా ఎత్తివేశారు.

గరిష్టస్థాయికి చేరువలో తుంగభద్ర:

తుంగభద్ర జలాశయంలోకి ఎగువ నుంచి భారీగా వరదనీరు పోటెత్తుతోంది. ఎగువ నుంచి 98644క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి నిలువ సామర్ధం 100.86టిఎంసీలు కాగా, ఇప్పటికే 74టిఎంసీల నీరు చేరింది. ప్రాజెక్టు నీటిమట్టం గరిష్టస్థాయికి చేరువవుతోందని అధికారులు వెల్లడించారు. వరద ఉధృతి పెరుగుతోందని , ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని అంచనా వేస్తు ప్రాజెక్టు గేట్ల ఎత్తివేతకు అన్ని విధాలుగా సిద్దంగా ఉన్నట్టు బోర్డు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఎగువనుంచి వస్తున్న భారీవరద ప్రవాహంతో ఆల్మట్టి జలాశయం శరవేగంగా నిండుతూ వస్తోంది. ఎగువన బెళగావి జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షాలకు దూద్‌గంగా ప్రాజెక్టులోకి 75వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టుగేట్లు ఎత్తివేసి వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువన ఆల్మట్టి ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. దీంతో ఆల్మట్టి ప్రాజెక్టులో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటినిలువ 129టిఎంసీలు కాగా ,ఇప్పటికే ఈ ప్రాజెక్టులో 78టిఎంసీల నీరు చేరింది. మరో రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయికి చేరుకునే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. దిగువన నారాయణపూర్ జలాశయంలో ఇప్పటికే నీటిమట్టం గరిష్టస్థాయికి చేరింది .

గోదావరి ప్రాజెక్టులకు భారీ వదర :

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి నదిలో వరదనీటి ప్రవాహం భారీగా పెరుగుతూ వస్తోంది. మహారాష్ట్ర నుంచి గోదావరి నది తెలంగాణ రా ష్ట్రంలోకి ప్రవేశించే నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కందర్తి వద్ద హరీం ద్ర , మంజీరా నదులు కలుస్తుండటంతో త్రివేణి సంగమం సముద్రాన్ని తలపిస్తోంది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి 98వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతోం ది. ప్రాజెక్టులో నీటిమట్టం 1074.2అడుగులుకు చేరింది. దిగువన ఎల్లపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో 10గేట్లను ఆరమీటరు ఎత్తున తెరిచి దిగువకు 15వేలక్యూసెక్కుల నీటిని వదులు తున్నారు. లక్ష్మిబ్యారేజ్ 35గేట్లు ఎత్తివేసి ఎగువ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తున్నారు. సరస్వతి బ్యారేజి 10గేట్లు ఎత్తివేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వరదనీరు నీరు పోటెత్తింది.

ఉధృతంగా కడెం :

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కడెం పరవళ్లు తొక్కుతోంది. ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తివేశారు. 64000క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సర్ణప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండిపోయింది. ప్రాజెక్టు గేట్లు ఎత్తి 3700 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పోచారం ప్రాజెక్టు పూర్తి స్థా యిలో నిండిపోయి గేట్లు తెరుచుకున్నాయి. కల్యాణి ప్రాజెక్టు , సింగీతం ప్రాజెక్టులొకి వరదనీరు భారీగా చేరుతోంది. గోదావరి నదిలో నీటి మట్టం అంతకంతకు పెరుగుతూ వస్తోంది. ఏపిలో ధవళేశ్వర బ్యారేజి వద్ద నీటిమట్టం 8.7అడుగులకు చేరింది. బ్యారేజి 175గేట్లు ఎత్తివేసి లక్ష క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలిపెడుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News