Wednesday, January 22, 2025

మధుర శ్రీక్రిష్ణ జన్మభూమి సర్వేపై వ్యాజ్యం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మధుర లోని శ్రీక్రిష్ణ జన్మభూమి షాహీ ఈద్గా మసీదు ఆవరణలో సర్వే జరిపించాలని కోరుతూ శ్రీక్రిష్ణ జన్మభూమి ముక్తి నిర్మాణ్ ట్రస్ట్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీం కోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఆ ఆవరణలో ఇదివరకు హిందూ ఆలయం ఉండేదని, దానిపై మసీదు నిర్మాణం జరిగిందా లేదా నిర్ధారించడానికి శాస్త్రీయ సర్వే చేపట్టాలని ట్రస్ట్ ఆ పిటిషన్‌లో పేర్కొంది. అయితే ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. అంతకు ముందు ట్రస్ట్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించి తమ పిటిషన్‌పై వచ్చే అభ్యంతరాలను విచారించే ముందు తమ వ్యాజ్యాన్ని

పరిష్కరించాలని మధుర సివిల్ జడ్జిని ఆదేశించాలని కోరగా, దానికి అలహాబాద్ హైకోర్టు తిరస్కరిస్తూ జులై 10న నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ట్రస్ట్ సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఇప్పుడు ఆశ్రయించగా, సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించింది. ట్రస్ట్ వ్యాజ్యానికి వ్యతిరేకంగా మసీదు నిర్వాహక కమిటీ , ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్‌బోర్డు మధుర సివిల్ కోర్టుకు తన అభ్యంతరాలను తెలియజేశాయి. దీన్ని ట్రస్ట్ వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించగా, అక్కడ కూడా చుక్కెదురైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News