Monday, April 14, 2025

‘కృష్ణ లీల’ మోషన్ పోస్టర్ అద్భుతంగా ఉంది

- Advertisement -
- Advertisement -

యంగ్ టాలెంటెడ్ దేవన్ హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో ఓ సూపర్ నేచురల్ లవ్ స్టొరీ రూపొందుతోంది. ధన్య బాలకృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తోంది. బేబీ వైష్ణవి సమర్పణలో మహాసేన్ విజువల్స్ బ్యానర్ పై జ్యోత్స్న జి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు- అనిల్ కిరణ్ కుమార్ జి అందించారు. ఈ సినిమాకి ’కృష్ణ లీల’ అనే బ్యాటీఫుల్ టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిధులుగా హీరో నిఖిల్, బ్రహ్మశ్రీ ఎల్ వీ గంగాధర్ శాస్త్రి, డీవోపీ చోటా కే నాయుడు హాజరయ్యారు. టైటిల్ లాంచ్ ప్రెస్ మీట్ లో హీరో నిఖిల్ మాట్లాడుతూ “మోషన్ పోస్టర్ నాకు చాలా నచ్చింది. ఇందులో దేవ్ డిఫరెంట్ షేడ్స్ నాకు చాలా నచ్చాయి.

కృష్ణ లీల పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను”అని అన్నారు. హీరో, డైరెక్టర్ దేవన్ మాట్లాడుతూ “నాకు సినిమా జీవితాన్ని ఇచ్చిన మా నిర్మాతలు జ్యోత్స్న, అనిల్‌కు ధన్యవాదాలు. చోటా కె నాయుడుకు ఈ సినిమా కథ చెప్పాను. ఆయన కొన్ని మార్పులు చెప్పారు. అవి మాకు చాలా ఉపయోగపడ్డాయి”అని తెలియజేశారు. నిర్మాత జ్యోత్స్న మాట్లాడుతూ “మా సినిమా కృష్ణ లీల నిజంగా ఒక అద్భుతం. ప్రతి ఒక్కరినీ జీవితంలో కనెక్ట్ చేసే పాయింట్స్ ఇందులో ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సతీష్ ముత్యాల, అనిల్ కుమార్ పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News