Monday, January 20, 2025

కాలువలో మునిగిన కారు… యజమాని కనిపించడంలేదు….

- Advertisement -
- Advertisement -

అమరావతి: కారు కాలువలో మునిగిపోయింది. కారు యజమాని మాత్ర కనిపించడంలేదు. కారులో ఒక జత దుస్తులు కనిపించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెదపాలిక సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అవనిగడ్డ ప్రాంతానికి చెందిన రత్నభాస్కర్ అనే వ్యక్తి మచిలీపట్నంలో జరుగుతున్న రాజకీయ పార్టీ సమావేశానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వచ్చాడు. సోమవారం పెద్దపాలిక వంతెను వద్ద కాలువలో కారు కనిపించడంతో ఓ లారీ డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని కాలువలోకి దిగి చూడగా కారు డోర్ తెరిచి ఉంది.

Also Read: మెడికల్ పిజిలో ఇడబ్ల్యుఎస్ కోటా అమలేది? 

కారు బయటకు తీయగా లోపల ఎవరు కనిపించలేదు. కారు యజమాని మాత్ర రత్నభాస్కర్‌గా గుర్తించారు. కాలువలో గాలింపు చర్యలు చేపట్టగా ఎక్కడ మృతదేహం కనిపించలేదు. రత్నభాస్కర్ పోన్ నంబర్‌కు కాల్ చేయగా స్విచ్ఛాఫ్ అని వస్తుంది. శనివారం రాత్రి 7.30 గంటలకు అతడు మచిలీపట్నంలో ఉన్నట్టు సెల్‌ఫోన్ సిగ్నల్స్ చూపుతున్నట్టు సమాచారం. అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రత్నకార్ అసలు బతికి ఉన్నాడా? లేక చనిపోయాడా? అతడిని చంపేసి కారును కాలువలోకి వదిలారా? ప్రమాదవశాత్తు కారు కాలువలో పడిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రత్నాకర్ కు చివరగా ఎవరు కాల్ చేశారు. ఎక్కడ నుంచి చేశారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు ఇంకా ఎవరైనా ఉన్నారా? కాలువలో గల్లంతయ్యారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News