Friday, February 28, 2025

తాగునీటికే తొలిప్రాధాన్యం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : కృష్ణా నదీ నీటి వినియోగంలో రెండు తెలుగు రాష్ట్రాలు తా గునీటికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(కెఆర్‌ఎంబి) నిర్దేశించింది. తర్వాతే రెండు రాష్ట్రాల్లో ఉన్న పంటల కోసం నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో ఉ న్న నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని బోర్డు స మావేశం నిర్ణయించింది. గురువారం కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోరు ఛైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో జలసౌధలో జరిగిన ప్రత్యేక సమావేశం ఆమేరకు ఇరు రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది. ప్రతి పదిహేను రోజులకోసారి సమీక్ష చేసుకుని నీటి నిల్వల ఆధారంగా వినియోగించుకోవాలని బోర్డు సూచించింది. ఈ సమావేశానికి తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ కుమా ర్,

ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్ర ధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఈఎన్సీ వెం కటేశ్వరరావు, ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు హాజరయ్యారు. గత మూడు రోజులుగా చోటుచేసుకు న్న పరిణామాలను చర్చించారు. నాగార్జునసాగర్, శ్రీశైలం నుంచి తమ తాగునీరు, సాగునీటి అవసరాల కోసం మే నెలాఖరు వరకు 63 టీ ఎంసీలు కావాలని తెలంగాణ అధికారులు, త మ అవసరాలకు 55 టీఎంసీలు కావాలని ఆం ధ్రప్రదేశ్ రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు తీసుకున్న నిర్ణయాలను బోర్డుకు  సమర్పించారు. ప్రస్తుతం రెండు జలాశయాల్లో కనీస వినియోగ మట్టానికి ఎగువన 60 టీఎంసీలకు పైగా నీరు ఉన్నందున వాటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని బోర్డు రెండు రాష్ట్రాలకు సూచించింది. తాగునీటికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని, ఉన్న పంటలను దృష్టిలో పెట్టుకొని మిగిలిన నీటిని ప్రణాళికతో వాడుకోవాలని బోర్డు సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News