ఆంధ్రప్రదేశ్ నిర్వాకాన్ని బ్రిజేష్
ట్రైబునల్ దృష్టికి తీసుకెళ్లిన
తెలంగాణ కృష్ణా జలాలపై తుది
వాదనలు ప్రారంభం 21వరకు
కొనసాగనున్న వాదనలు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా నదీ నీటి వివాదాలపై బుధవారం న్యూఢిల్లీలో తుది వాదనలు ప్రారంభమయ్యాయి. వరుసగా మూడు రోజుల పాటు కొ నసాగనున్నాయి. కృష్ణా వాటర్ డిస్పూట్ ట్రైబ్యునల్ చై ర్మన్ జస్టిస్ బ్రిజేష్ కుమార్, సభ్యులు జస్టి స్ రాంమోహన్ రెడ్డి, జస్టిస్ ఎస్.తలపాత్ర ఎదుట తెలంగాణ తన వాదనలు ప్రారంభించింది. తెలంగాణ సీనియర్ న్యాయవా ది సీఎస్ వైద్యనాథన్ వాదనలు ప్రారంభి స్తూ కృష్ణా బేసిన్ దాని ఉపవాగుల గురించి వివరిస్తూ 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, రాష్ట్ర సరిహద్దుల్లో వచ్చిన మార్పుల ను మ్యాప్‌ల ద్వారా ఆయన వివరిస్తూ 19 56 తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న పరిపాలనాపరమైన నిర్ణయాలను వివరిస్తూ నీరు, ఉ పాధి, ఆర్థిక అంశాలలో నాటి పాలకులు ఆంధ్ర ప్రాంతానికి అనుకూలంగా వ్యవహరించారని స మగ్రంగా వెల్లడించారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులకు కేటాయించిన నీటి వినియోగం చాలా తక్కువగా ఉందన్నారు.అంతర్-రాష్ట్ర నదీ జ లాల సమానమైన వాటా, సహేతుకమైన వినియోగానికి సంబంధించిన జాతీయ, అంతర్జాతీ య సూత్రాలను తెలంగాణ
సీనియర్ అడ్వకేట్ సీఎస్ వైద్యనాథన్ వివరించారు. గోదావరి జలాలను తరలించుకునిపోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రణాళికను ఆయన ట్రిబ్యునల్ దృష్టికి తీసుకువచ్చారు.
ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్నటువంటి వాస్తవ సాగు విస్తీర్ణాన్ని తగ్గించడం ఉద్దేశం కాదని, అయితే బేసిన్‌లోని ప్రాంతాలు కనీసం ఒక్క పంటకైనా నీటి కోసం తహతహలాడుతున్నప్పుడు బయటి బేసిన్ ప్రాంతాలకు నీటిని వినియోగించుకునే విలాసాన్ని అనుమతించరాదని ఆయన సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ వెలుపలి బేసిన్ ప్రాంతాలకు అందుబాటులో ఉన్న అదనపు నీటి వనరులైన పోలవరం 80 టిఎంసి, పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సుమారు 100 టిఎంసి, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 27 టిఎంసి వంటి వాటిని ట్రైబ్యునల్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ జలాలకు బదులు తెలంగాణకు కృష్ణా జలాలు కేటాయించాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి కారణంగా కృష్ణా డెల్టా వ్యవస్థ, నాగార్జునసాగర్ కమాండ్ ఏరియాల తగ్గింపు వల్ల తెలంగాణకు కేటాయించబడే నీటి వినియోగం తగ్గుతుందన్నారు. జాతీయ, అంతర్జాతీయ న్యాయసూత్రాలకు లోబడి హెల్సింకి రూల్స్, బెర్లిన్ రూల్స్, యూఎన్ వాటర్‌కోర్స్ కన్వెన్షన్ వంటి చట్టాలు, ట్రిబ్యునల్ అవార్డులు, సుప్రీం కోర్డు తీర్పులను ఆయన ఉదహరిస్తూ సమానమైన విభజన సూత్రాలకు లోబడి తెలంగాణకు న్యాయం చేయాలని కోరారు.