Thursday, January 23, 2025

ఫ్యామిలీ అంతా చూసి నవ్వుకునే సినిమా

- Advertisement -
- Advertisement -

నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూ ల్పూరి నిర్మించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఈ చిత్రంతో షిర్లీ సెటియా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. ఈనెల 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న నేపధ్యంలో ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఈవెంట్‌కి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. చిత్ర యూనిట్ తో పాటు నిర్మాతలు నాగవంశీ, సుధాకర్ చెరుకూరి, వివేక్, దామోదర్ ప్రసాద్, హర్షిత్ రెడ్డి, దర్శకులు నందినీ రెడ్డి, బివిఎస్ రవి, మాజీ మంత్రి రఘువీర రెడ్డి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఈ వేడుకలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ “ట్రైలర్ చాలా నచ్చింది. ఫ్యామిలీ అంతా కలసి చూసి నవ్వుకునేలా కనిపించింది. ఈ సినిమా శౌర్య కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది”అని తెలిపారు. హీరో నాగశౌర్య మాట్లాడుతూ “దర్శకుడు అనీష్ కృష్ణ సినిమాను అద్భుతంగా తీశారు. ఈ సినిమా లో ఒక కీలకమైన సన్నివేశం వుంది. సినిమా లైఫ్ ని నిర్ణయించే సన్నివేశం అది. ఆ ఒక్క సీన్‌ను లక్ష్మీభూపాల అద్భుతంగా రాశారు. మహతి సాగర్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. విజయ్ పాటలని చాలా బ్యూటీఫుల్‌గా కోరియోగ్రఫీ చేశా రు. కాసర్ల శ్యామ్ మంచి సాహిత్యం అందించా రు.

శెర్లీ చాలా మంచి నటి. అందంగా పాడుతుం ది కూడా. తనతో నటించడం ఆనందంగా వుంది”అని అన్నారు. దర్శకుడు అనీష్ ఆర్ కృష్ణ మాట్లాడుతూ “నాగశౌర్యకు కథ చెప్పిన వెంటనే కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి షూటింగ్ మొదలుపెట్టారు. ఐరా క్రియేషన్స్ ఉషా, శంకర్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు. వారు ధైర్యంగా నిలబడటం వల్లనే సినిమా ఇంత గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షిర్లీ సెటి యా, మహతి స్వరసాగర్, బ్రహ్మాజీ, లక్ష్మీభూపాల, కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News