Saturday, January 25, 2025

‘కృష్ణ వ్రింద విహారి’ ఫస్ట్ లుక్ విడుదల..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వరుడు కావలెను మూవీ ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో నాగ శౌర్య ప్రస్తుతం కొత్త దర్శకుడు అనిష్ ఆర్. కృష్ణతో ఓ మూవీ చేస్తున్నాడు. శనివారం నాగ శౌర్య పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమా టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. నాగశౌర్య 22వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి ‘కృష్ణ వ్రింద విహారి’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను మేకర్స్ ఖరారు చేశారు. ఇక, ట్రెడిషనల్ అండ్ స్పిరిట్చువల్ లుక్‌లో ఉన్న నాగశౌర్య ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. శౌర్య సొంత బ్యానర్ బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై ఉషా మూల్పూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.

 ‘Krishna Vrinda Vihari’ Movie first look Poster

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News