Wednesday, January 22, 2025

`కృష్ణ వ్రింద విహారి` విడుదల తేదీ ఖరారు

- Advertisement -
- Advertisement -

`Krishna Vrinda Vihari` will be released on April 22

 

వైవిధ్యమైన సబ్జెక్ట్లతో విభిన్న పాత్రలు పోషిస్తున్న అందమైన నటుడు నాగ శౌర్య. ప్రస్తుతం ఐరా క్రియేషన్స్ బేనర్లో అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో రామ్-కామ్ చిత్రంలో నటిస్తున్నాడు. సోమవారం నాడు సినిమా విడుదల తేదీని మేకర్స్  ప్రకటించారు. కృష్ణ వ్రింద విహారి వేసవి కానుకగా ఏప్రిల్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. విడుదల తేదీని ప్రకటించిన పోస్టర్లో నాగ శౌర్య, చిత్ర నాయిక షిర్లీ సెటియా స్కూటర్ పై వెళుతున్నట్లు కనిపిస్తోంది. శౌర్య,  షిర్లీ సెటియా ఇద్దరూ సంప్రదాయ దుస్తులలో చూడముచ్చటగా ఉన్నారు. పోస్టర్ని బట్టి చూస్తే, సినిమాలో వీరిద్దరూ అద్భుతమైన కెమిస్ట్రీ ని పంచుకున్నట్లు కనిపిస్తోంది.

గతంలో ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. తొలిసారిగా నాగ శౌర్య ఈ చిత్రంలో ఇటువంటి పాత్రను పోషిస్తున్నాడు. ఇంతకుముందు  సినిమాలలో అతని పాత్రలకు భిన్నంగా,  వినోదభరితమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని ఉషా ముల్పూరి నిర్మిస్తుండగా, శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ స్వరాలు సమకూరుస్తుండగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. స్టార్ కమెడియన్లు వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య నటించడం వల్ల ఈ సినిమా హాస్యభరితంగా ఉంటుందని అర్థం అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News