Thursday, January 23, 2025

శివ..శివ! ఏమిటీ కృష్ణ మాయ?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : కృష్ణానదీ జలాల పంపిణీ పంచాయతీ ఢిల్లీకి చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వేసవిలో ఎండుతున్న గొంతులను త డుపు కోవాలంటే రెండు రాష్ట్రాలు కేంద్ర ప్రభు త్వం ముందు సాగిలపదాల్సిందే.. తన అవసమర్ద త..వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కృష్ణానదీయాజమాన్య బోర్డు తనంతట తానుగా తెలుగు రాష్ట్రాలకు ఈ పరిస్థితులు కల్పించింది. కృష్ణానదీజలాల పంపిణీ వ్యవహరంలో మీ రే నిర్ణయం తీసుకోవలని కోరుతూ బోర్డు చైర్మన్ శివనందన్ కు మార్ కేంద్ర జల్‌శక్తిశాఖకు లేఖ రాశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పట్ల కృష్ణానదీజలాల పంపిణీ, నీటి విడుదల నిర్వహణలో నిస్పాక్షికంగా వ్యవహరించాల్సిన బోర్డు అంతటితో ఆగకుండా ఒక రాష్ట్రానికి కొ మ్ముకాసే విధంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణల ను ఎదుర్కొంటోంది. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రా ష్ట్రాలకు ఉమ్మడి ప్రాజెక్టులు గా ఉన్న శ్రీశైలం , నా గార్జున సాగర్ ప్రాజెక్టుల్లో నీటి వినియోగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్ర భుత్వం తెలంగాణ రాష్ట్రంపై చేసిన ఆరోపణలు, ఫిర్యాదులను గుడ్డి గా నమ్మి వేసవిలో తెలంగాణ ప్రజల గొంతులు ఎండబేట్టేవిధంగా నీటి విడుదలపై తెలంగాణ ప్రభుత్వాన్ని కట్టడి చేసే చర్యలకు దిగింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవసరాల రీ త్యా తనకు కే టాయించిన నీటికంటే 7.31టిఎంసీలను అధికం గా వినియోగించుకుందని , తక్ష ణం నాగార్జున సాగర్ నుంచి ఎడమ కాలువ నీటి విడుదలను ఆపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణాబోర్డుకు లేఖ ద్వారా ఫిర్యాదు చే సింది. బోర్డు కూ డా తెలంగాణ ను ఏవిధమైన విరవరణ కోరకుండానే తక్షణం ఎడమ కా లువకు నీటి విడుదలను నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది. అంతే కాకుండా తెలంగాణ రా ష్ట్రం తమ రాష్ట్ర అవసరాలు, శ్రీ శైలం , నాగార్జున సాగర్ రిజర్వాయర్ల లో నీటి నిలువలు తదితర అంశాలను వివరిస్తూ బోర్డుకు లేఖ రా సింది. కృష్ణానదీజలాలనుంచి తాగునీటి అవసరాలకు వినియోగించుకునే నీటి లో వంద లీటర్ల నీ టిని విడుదల చేసుకుంటే అం దులో 20శాతంమాత్రమే వినియోగం అవుతున్నా యి. 80 లీటర్ల నీరు తిరిగి పలు రూపాల్లో , వివిధ మార్గాల్లో నదిలోనే కలిసిపోతుంది. అందుకే ట్రి బ్యునల్ తెలగాణ రాష్ట్ర తాగునీటి కోసం కేటాయించిన నీటిలో కేవలం 20శాతం నీటిని మా త్రమే పరిగణలోకి తీసుకోవాలని తెలంగాణ రాష్ట్రం బోర్డుకు వివరించింది. అం తే కాకుండా తమ వాట నీటిని ఒక నీటి సంవత్సరంలో పూర్తిగా ఉపయోగించుకుకుండా శ్రీశైలం,

నాగార్జున సాగర్ రిజర్వాయర్లలో మిగుల్చుకుం టే, ఆ విధంగా మిగుల్చుకున్న నీటిని ఆ పై నీటి సంవత్సరం వాడుకునేలా అనుమతించాలని కూ డా బోర్డుకు వివరిస్తూ లేఖ రాసింది. అయితే ఈ రెండు అంశాలను ఏ మాత్రం పరిగణలోకి తీసుకొండా బోర్డు తెలగాణ పట్ల కఠిన వైఖరిని కనబరిచింది. గత అక్టోబర్‌లో నిర్వహించిన త్రిసభ్య కమిటీలో కృష్ణానదీజలాలకు సంబంధించి తెలంగాణకు 42టీఎంసీల నీటిని కేటాయిస్తూ ఆంగీకారం కుదిరింది. అందులో శ్రీశైలం జలాశయం నుంచి 17.60 , నాగార్జున సాగర్ నుంచి 24.79టిఎంసీల నీటిని తీసుకునేలా ఒప్పందం కుదిరింది, అయితే ఈ 42టీఎంసీల నీటికంటే అదనంగా 7.31టిఎంసీలు వాడుకున్నారని ఇక తక్షణం నీటి విడుదలను నిలిపి వేయాలని బోర్డు తెలంగాణ రాష్ట్రాన్ని ఆదేశించింది. మరో వైపు అదే సమావేశంలో ఏపికి 45టిఎంసీలు కేటాయించగా,

అందులో శ్రీశైలం నుంచి 26.90, సాగర్ నుంచి 15.47టిఎంసీల నీటిని వినియోగించుకున్నామని , ఇంకా 3టీఎంసీల నీరు మిగిలి వుందని ఏపి వాదిస్తోంది. నాగార్జున సాగర్‌లో 505అడుగుల డెడ్‌స్టోరేజి స్థాయికి ఎగువన లభ్యత నీరు 12టిఎంసీలు ఉంది. తమ రాష్ట్ర అవసరాల రీత్యా సాగర్ కుడికాలువ ద్వారా ఈ నెల 8నుంచి 5టిఎంసీల నీటిని విడుదల చేయాలని బోర్డుకు లేఖ రాసింది. ఈ లేఖపై మాత్రం బోర్డు సానుకూలంగా వుంది. ఏపి నీటివినియోగంలో బోర్డుకు తెలిపిన లెక్కలకు కూడా కళ్లు మూసుకుని ఆంగీకారం తెలిపింది. తెలంగాణ పట్ల ఒక విధంగా , ఏపి పట్ల మరో విధంగా వ్యవహరిస్తున్న బోర్డు వైఖరిపట్ల తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. త్వరలోనే అన్ని విశయాలను వివరిస్తూ లేఖ రాయలని నిర్ణయించుకుంది.
త్రిసభ్య కమిటీ భేటీ వాయిదా
తెలుగు రాష్ట్రాల నీటి అవసరాలపై చర్చించేందుకు కృష్ణానదీయాజమాన్య బోర్డు గురువారం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సమావేశానికి తెలంగాణ , ఏపి అధికారులు హాజరు కాలేదు. కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల సమావేశానికి హాజరు కాలేకపోతున్నట్టు బోర్డుకు రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖల ఈఎన్సీలు సమాచారం అందించారు.దీంతో బోర్డు సభ్య కార్యదర్శి రాయపురే త్రిసభ్యకమిటీ సమావేశాన్ని 12వ తేదీకి వాయిదా వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News